• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సీఎం పేదల గుండెల్లో ధైర్యాన్ని నింపుతున్నారు: MLA

NLR: 20 నెలల స్వల్ప కాలంలోనే కోవూరు నియోజకవర్గంలో ​ 687 మంది అనారోగ్య బాధితులకు 7 కోట్ల 27 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. శనివారం 24 వ విడతగా 35 మందికి రూ. 55 లక్షల 42 వేల చెక్కులు అందించమన్నారు. ​వేలాది మందికి పునర్జన్మ ప్రసాదిస్తూ.. పేదల గుండెల్లో ధైర్యాన్ని నింపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

February 21, 2026 / 05:03 PM IST

జీరో లిట్టర్ గవర్నెన్స్ పై అవగాహన

ASP: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళ డిగ్రీ కళాశాలల్లో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా జీరో లిట్టర్ గవర్నెన్స్‌పై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. చెత్త రహిత రాష్ట్రంగా మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యమని ప్రిన్సిపాల్స్ డా కేబీకే నాయక్, చలపతిరావులు తెలిపారు. పరిసరాలను శుభ్రపరిచే భాద్యత అందరిదీ అని అన్నారు.

February 21, 2026 / 05:01 PM IST

ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు పరిశీలన

మదనపల్లి పట్టణం నక్కలదిన్నె బీటీ కళాశాల మైదానంలో రూ.5 కోట్లతో ఇండోర్ స్టేడియం, మహిళలు-పురుషులకు వాకింగ్ ట్రాక్, జిమ్, పిల్లల కోసం చిన్న పార్క్ ఏర్పాటుపై అన్నమయ్య జిల్లా కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు. ప్రతిపాదిత పనులపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

February 21, 2026 / 05:00 PM IST

పునర్విక కోసం సాంజో స్కూల్ విరాళం

NDL: ద్రోణాచలం సేవాసమితి ఆధ్వర్యంలో చిన్నారి పునర్విక చికిత్స కోసం సాంజో స్కూల్ విద్యార్థులు రూ.24,997 విరాళం శనివారం అందజేశారు. విద్యార్థులు తమ ఖర్చు డబ్బులు, పొదుపు మొత్తాలను చందాలుగా సమీకరించి పెద్ద మనసును చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ అనేట్, యాజమాన్యం, ఉపాధ్యాయులు సహకరించారు. సేవాసమితి సభ్యులు విద్యార్థులను అభినందించారు.

February 21, 2026 / 05:00 PM IST

బయో మెడికల్ వ్యర్ధాల నిర్వహణ

W.G: తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని అక్కడ బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ గురించి పరిశీలించడం జరిగింది. నాలుగు రంగుల చెత్త బుట్టలు-ఎరుపు, పసుపు, నీలం, తెలుపు ఏర్పాటు చేసి వచ్చిన వ్యర్థాలను తదనుగుణంగా తీసి సరైన పద్దతిలో డిస్పోజ్ చేసే విషయం గురించి పరిశీలించారు.

February 21, 2026 / 05:00 PM IST

ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యం: MLA

కోనసీమ: రాష్ట్రాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దడం, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అల్లవరంలో శనివారం స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.

February 21, 2026 / 05:00 PM IST

భాష్యం విద్యా సంస్థ ఎదుట ధర్నా

ATP: గుంతకల్లులోని భాష్యం విద్యా సంస్థ ఎదుట ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ.. కోర్సుల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్న చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. 

February 21, 2026 / 05:00 PM IST

‘ విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి’

సత్యసాయి: హిందూపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బాబావలి ఆధ్వర్యంలో ‘చలో విజయవాడ’ పోస్టర్లను శనివారం విడుదల చేశారు. ఈ నెల 27న జరిగే కార్యక్రమానికి విద్యార్థులు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. విద్యా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని తెలిపారు.

February 21, 2026 / 05:00 PM IST

మంత్రాలయంలో ‘స్వచ్ఛరథం’ ప్రారంభం

KRNL: మంత్రాలయంలో MPDO నూర్జహాన్, MRO రమాదేవి ఆధ్వర్యంలో మంచాల సొసైటీ చైర్మన్ రామకృష్ణ రెడ్డి ఇవాళ ‘స్వచ్ఛరథం’ వాహనాన్ని ప్రారంభించారు. ఈ వాహనం గ్రామాల్లో ప్లాస్టిక్, స్క్రాప్ వంటి వ్యర్థాలను సేకరించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడనుందని పేర్కొన్నారు. ‘శుభ్రమైన మండలం-అభివృద్ధి చెందిన మంత్రాలయం’ లక్ష్యంతో ఈ పనులకు శ్రీకారం పుట్టినట్లు పేర్కొన్నారు.

February 21, 2026 / 05:00 PM IST

మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ

KKD: SP బిందుమాధవ్ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోటార్ ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా SP మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

February 21, 2026 / 05:00 PM IST

YSR పేరు మార్పుపై అంబటి ఆగ్రహం

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీకి ఉన్న మాజీ సీఎం డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మార్చడం దారుణమని వైసీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. శనివారం ANUలో VC గంగాధరరావును కలిసి వినతిపత్రం ఇచ్చి, 2009 పాలకమండలి తీర్మానాన్ని గౌరవించాలని కోరారు.

February 21, 2026 / 04:53 PM IST

ఘనంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు

GNTR: కృష్ణానగర్ 1వ లైన్‌లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీనారాయణస్వామి 80వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శనివారం హయగ్రీవ విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుల కల్యాణం వైభవంగా జరిగింది. విష్ణుసహస్రనామ పారాయణ, గరుడ వాహనంపై తిరువీధి ఉత్సవం భక్తులను ఆకట్టుకుంది.

February 21, 2026 / 04:49 PM IST

27 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

AKP: ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలో 27 మందికి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శనివారం స్థానిక జడ్పీ అతిథిగృహంలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వీరికి రూ.13.76 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న వారికి తన సిఫారసు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయిందన్నారు. ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

February 21, 2026 / 04:45 PM IST

కొలువుదీరిన కొమ్ముగూడెం సొసైటీ నూతన పాలకవర్గం

W.G: తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్ముగూడెం గ్రామం విశాల సహకార పరపతి సంఘ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార మహోత్సవం శనివారం జరిగింది. నూతన అధ్యక్షులుగా అబ్బిన వీర వెంకటరావు పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జి మాట్లాడారు. సభ్యుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

February 21, 2026 / 04:45 PM IST

చిత్తూరులో అభివృద్ధి పనుల ప్రారంభించిన ఎమ్మెల్యే

CTR: ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ శనివారం చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 4వ వార్డు కట్టమంచి లాయర్స్ కాలనీలో రూ. 19.30 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్డు, సిమెంట్ కాలువలను ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. లాయర్స్ కాలనీ ఎక్స్‌టైన్ష‌న్‌‌కు“వెంకటరమణ నగర్”గా నామకరణం చేసి ఆవిష్కరించారు.

February 21, 2026 / 04:41 PM IST