• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘వైసీపీ పాలనలో కల్తీ రాజకీయాలు’

అన్నమయ్య: వైసీపీలో బడుగు బలహీన వర్గాలను విస్మరించి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాషా ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నాయకులు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సహాయం అందిస్తోందని తెలిపారు.

March 4, 2026 / 04:22 PM IST

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

KKD: తాళ్లరేవు మండలం సీతారామపురం గుడ్డివానితూము కూడలిలోని ఒక భవనంపై బుధవారం గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు ఎర్రని బనియన్ ధరించి, చేతికి కడియం కలిగి ఉన్నాడు. వారం రోజుల కిందటే మృతి చెంది ఉంటాడని కోరింగ పోలీసులు భావిస్తున్నారు.

March 4, 2026 / 04:20 PM IST

లక్ష్మీపతి రెడ్డిని పరామర్శించిన శ్రీధర్ రెడ్డి

సత్యసాయి: నల్లమాడ మండలం రాగానిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి లక్ష్మీపతి రెడ్డి ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి కదిరిలోని ఆయన నివాసానికి వెళ్లారు. లక్ష్మీపతి రెడ్డిని పరామర్శించి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

March 4, 2026 / 04:20 PM IST

వైసీపీ గ్రామ కమిటీల డిజిటలైజేషన్ పూర్తి

KRNL: పెద్దకడబూరు మండలంలోని 20 పంచాయతీల గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాలను డిజిటలైజ్ చేసి రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఇవాళ MLA బాలనాగిరెడ్డికు అందజేశారు. సుమారు 2,200 మందిని కమిటీల్లో నియమించినట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఈ ప్రక్రియ చేపట్టినట్లు నాయకులు పేర్కొన్నారు.

March 4, 2026 / 04:15 PM IST

మాజీ సీఎంని మాజీ ఎమ్మెల్యే

PPM: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని నేడు అరకు విచ్చేసిన సందర్భంగా పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందచేసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్టీ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేయాలని అధినేత పిలుపునిచ్చారు.

March 4, 2026 / 04:14 PM IST

రేపు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

కోనసీమ: కొత్తపేట మండలంలోని బిళ్లకుర్రు 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో RDSS పథకం పనులు చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ రాంబాబు తెలిపారు. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో బిళ్లకుర్రుతో పాటు మోడేకుర్రు, గొల్లకోటివారిపాలెం గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.

March 4, 2026 / 04:11 PM IST

నాలుగు లైన్ల రహదారిపై గందరగోళ ప్రయాణం

ASR: ఇటీవల నిర్మాణం పూర్తైన జాతీయ రహదారి 516ఈ పై అవగాహన లోపంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. డుంబ్రిగూడ మండలం జైపూర్ జంక్షన్ వద్ద వాహనాల రాకపోకలు అధికంగా ఉండగా, నాలుగు లైన్ల విధానాన్ని పట్టించుకోకుండా ఎదురెదురుగా ప్రయాణించడం ప్రమాదాలకు దారితీస్తోంది. సరైన దిశా సూచికలు, హెచ్చరిక బోర్డులు లేకపోవడం సమస్యను మరింత తీవ్రం చేస్తోంది.

March 4, 2026 / 04:07 PM IST

అంగన్వాడీ కేంద్రంలో పరిశుభ్రత పక్షోత్సవాలు

TPT: పరిశుభ్రత పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం గూడూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని దిగు వీరారెడ్డిపల్లిలో పరిశుభ్రత పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మాట్లాడుతూ.. పిల్లల వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు అంగన్వాడీ కేంద్రాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం పట్ల తగు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.

March 4, 2026 / 04:05 PM IST

ముగ్గురి మృతికి కారణం ఇదే.!

నంద్యాల జిల్లా డోన్(మం) జగదుర్తి సమీప జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి క్రేన్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని డీఎస్పీ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. రాంగ్ రూట్లో వాహనం నడపడం వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. క్రేన్ డ్రైవర్, యజమానిని అదుపులోకి తీసుకుని రిమాండు తరలించామని తెలియజేశారు.

March 4, 2026 / 04:00 PM IST

కూటమి ప్రభుత్వంలో భారీగా పెట్టుబడులు: ఎమ్మెల్యే

NLR: యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ.1232 కోట్లు కేటాయించడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి గొప్ప మలుపుగా చెప్పుకోవచ్చని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కొత్త పరిశ్రమలు రాలేదని.. ఉన్న పరిశ్రమలు తరలి వెళ్ళిపోయాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులు భారీగా తరలి వస్తున్నాయని చెప్పారు.

March 4, 2026 / 04:00 PM IST

భూపతిపాలెం స్కూల్ అభివృద్ధికి రూ. 20 లక్షలు మంజూరు

E.G: గోకవరం మండలం భూపతిపాలెం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అభివృద్ధికి రూ. 20 లక్షల నిధులు మంజూరైనట్లు స్కూల్ పేరెంట్స్ కమిటీ ఛైర్మన్ గల్లా రాము బుధవారం తెలిపారు. జగ్గంపేట MLA జ్యోతుల నెహ్రూ ఈ నిధులను కేటాయించారు. ఈ నిధులతో స్కూల్ డార్మెట్రీకి వెళ్లే దారిలో సిమెంట్ రోడ్లు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

March 4, 2026 / 04:00 PM IST

ఏఎన్ఎం విజయ్ భారతిపై చర్యలు తీసుకోవాలని వినతి

ATP: గుంతకల్లు ఆశా వర్కర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఎన్ఎం విజయభారతి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ CITU నాయకులు ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ హాస్పిటల్ DDO గంగాధర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా CITU  నాయకులు సాకే నాగరాజు, తిమ్మప్ప మాట్లాడుతూ.. ఆశా వర్కర్లపై మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

March 4, 2026 / 04:00 PM IST

వేములూరులో ఆత్మరక్షణ అవగాహన సదస్సు

E.G: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా కొవ్వూరు డీఎస్పీ దేవ కుమార్ ఆధ్వర్యంలో వేములూరు దీప్తి హైస్కూల్‌లో విద్యార్థినులకు ఆత్మరక్షణ శిక్షణ నిర్వహించారు. కరాటే ఇన్‌స్పెక్టర్ ఆకుల రాధ విద్యార్థినులకు మెళకువలు నేర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ పీ.విశ్వం, తదితరులు పాల్గొన్నారు. మహిళలు స్వయం రక్షణ పట్ల అవగాహన కలిగి ఉండాలని అధికారులు సూచించారు.

March 4, 2026 / 04:00 PM IST

‘సమస్యల లోగిల్లలో టిడ్కో ఇళ్లు’

W.G: ప్రభుత్వ ఇళ్లా, ఉద్యాన వనాలా? అని టిడ్కో ఇళ్ళు సమస్యలకు నిలయాలుగా మారాయని సీపీఎం జిల్లా కార్యదర్శి జే.ఎన్.వీ.గోపాలన్ విమర్శించారు. సీపీఎం చేపట్టిన జిల్లా ప్రజా చైతన్య పాదయాత్ర 7వ రోజు ఉత్సాహపూరితంగా తాడేపల్లిగూడెం మండలంలో ఉత్సాసాగింది. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, సత్యనారాయణ, క్రాంతిబాబు, ఎ.అజయకుమార్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

March 4, 2026 / 03:57 PM IST

‘410 మంది గైర్హాజరు’

TPT: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా 98 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 25,199 మంది విద్యార్థులకు గాను 24,789 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 410 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలియజేశారు.

March 4, 2026 / 03:48 PM IST