అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం 2:13 గంటల సమయానికి అనంతపురంలో 36°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజు ఆకాశం నిర్మలంగా ఉండి, ఎండ తీవ్రత అధికంగా ఉంది. గాలి గంటకు 9 మైళ్ల వేగంతో తూర్పు దిశ నుంచి వీస్తోంది. హ్యూమిడిటీ 19 శాతంగా ఉండగా, యూవీ ఇండెక్స్ 5గా నమోదైంది.
NLR: కందుకూరు శివారులో కొండముడుసుపాలెం జంక్షన్ సమీపంలో బుధవారం హైవేపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఒంగోలు నుంచి పామూరు వెళ్తున్న కారు నిలిపి ఉన్న వాహనాన్ని ఢీ కొట్టడంతో చాంద్ బాషా మృతి చెందాడు. ఈయనది పామూరు సమీప గ్రామమని సమాచారం. గాయపడ్డ ఆదిశేషారెడ్డిని ఒంగోలు RIMSకు తరలించారు.
E.G: గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కడియం MPP వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం వీరవరంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి స్థల సేకరణలో భాగంగా గ్రామ సర్పంచ్ బత్తుల జయంతి భర్త రాము, తహసీల్దార్ సునీల్ కుమార్ పలు ప్రాంతాలను పరిశీలించారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆర్డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. బుధవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాగునీటి పైప్‌లైన్‌ల లీకేజీలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.
NDL: సమస్త జీవులకు నీరే ప్రాణాధారమని జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బ్రహ్మానంద ఆచారి అన్నారు. బనగానపల్లె మండలం దేవనగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల యందు ఇవాళ ఆయన విద్యార్థులకు నీటి యొక్క విశిష్టతపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం బ్రహ్మానంద ఆచారి విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు.
కృష్ణా: పామర్రు నియోజకవర్గంలో సోమవారం నిర్వహించనున్న ధర్నాలో MLA అక్రమాలు, ఇసుక దందాలు, దోపిడీలను ప్రజల ముందుకు తీసుకొస్తామని మాజీ MLA కైలే అనిల్ కుమార్ అన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మూడు సెంట్ల భూమిని అర్హులకు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని ప్రస్తుత MLAకు సవాల్ విసిరారు. పంచాయతీ ఎన్నికల కోసం ఇళ్ల స్థలాల డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రకాశం: హనుమంతునిపాడు మండలం కిష్టంపల్లిలో నూతనంగా మంజూరైన బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మండల టీడీపీ అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రహదారి నిర్మాణానికి కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సహకారం అందించినట్లు నాయకులు తెలిపారు. రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు రాకపోకలు సులభతరం అవుతాయని వారు పేర్కొన్నారు.
TPT: తడ మండలం పెరియవట్టు గ్రామంలో జరిగిన ప్రభాకరన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలతో వి.దినేష్, వి.సతీష్, వి.విగ్నేష్ అలియాస్ విక్కీ అనే ముగ్గురు అన్నదమ్ములు కత్తులతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి, క్రైమ్ నం. 33/2026 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు.
PPM: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం ఈనెల 6వ తేదీ నుంచి మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. మార్చి 6వ తేదీన వీరఘట్టం, పాలకొండ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అలాగే, మార్చి 7వ తేదీన జిల్లాలోని వివిధ ప్రాంతాలను సందర్శించి, రాత్రికి పార్వతీపురంలోనే బస చేస్తారు.
అన్నమయ్య: కాకినాడ జిల్లాలో జరిగిన బాణసంచా ప్రమాదం నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో టపాసుల తయారీ కేంద్రాలు, విక్రయశాలలపై కఠిన ఆంక్షలు విధించినట్లు ఎస్పీ ధీరజ్ తెలిపారు. తనిఖీలు పూర్తయ్యే వరకు అన్ని బాణసంచా కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. PESO నిబంధనలు, లైసెన్సులు, భద్రతా ప్రమాణాలపై రెవెన్యూ, అగ్నిమాపక శాఖలతో కలిసి పోలీసులు సంయుక్త తనిఖీలు చేపట్టారు.
ELR: ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో జీ. రమేష్ బాబు కోరారు. బుధవారం ఉంగుటూరులో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లను డిప్యూటీ ఎంపీడీవో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి బొడ్డు. వెంకట రవిచంద్ర కుమార్, రామోజీరావు, పంచాయతీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
VZM: గరివిడిలోని మసీదులో జరిగిన పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షల కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసిన ఆయన, అల్లా దీవెనలు అందరికీ మెండుగా లభించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎంపీ, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నెల్లూరు 53 డివిజన్ పరిధిలోని కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద నిద్రమత్తులో భారీ ట్యాంకర్ ఇంట్లో దూసుకుని వెళ్లి మౌలాలి మస్తానమ్మకు గాయాలైన విషయం తెలిసిందే. వారికి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించామని చెప్పారు. పేదవారు కావడంతో వైద్య ఖర్చులకు కష్టతరంగా ఉందని పాలకులు స్పందించి వారికి అండగా నిలవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
సత్యసాయి: తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రి ఎస్.సవితను పలువురు సందర్శకులు, కూటమి నాయకులు కలిశారు. తమ ప్రాంతాల్లోని పలు సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. బాధితుల సమస్యలను సావధానంగా విన్న మంత్రి, వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
KRNL: తుగ్గలి(మం) జొన్నగిరి ప్రధాన రహదారిపై ఎస్సై మల్లికార్జున ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ.. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.