• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పీసీ & పీఎన్‌డీటీ చట్టంపై సమీక్షా సమావేశం

VZM: పీసీ & పీఎన్‌డీటీ చట్టం అమలుపై స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఏవో ఆర్. ఈశ్వరమ్మ అధ్యక్షతన గురువారం సమీక్షా సమావేశం జరిగింది. డివిజనల్ స్థాయి కమిటీ అధికారులతో కలిసి చట్ట అమలు, తీసుకుంటున్న చర్యలు, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. పీఎన్‌డీటీ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.

March 26, 2026 / 08:11 PM IST

బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు: ఎస్పీ

GNTR: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లతో జీవితాలను నాశనం చేసుకోవద్దని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, యువతకు పిలుపునిచ్చారు. ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్ ప్రారంభంలో చిన్న మొత్తాలతో మొదలై, తర్వాత పెద్ద నష్టాలకు దారి తీస్తాయని తెలిపారు.

March 26, 2026 / 08:05 PM IST

మిస్సింగ్ కేసు.. 24గంటల్లో ఛేదించిన పోలీసులు

సత్యసాయి: నల్లమాడ మండలం కొండ్రువారిపల్లికి చెందిన మీనాక్షి(19) అదృశ్యంపై నమోదైన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ విజయ్ కుమార్, సీఐ శ్రీనివాస్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. సంతకు వెళ్లి తిరిగి రాని యువతి ఆచూకీని పోలీసులు చాకచక్యంగా గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

March 26, 2026 / 08:03 PM IST

‘వైసీపీ బలోపేతంపై దృష్టి పెట్టాలి’

KKD: నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో మాజీ హోంమంత్రి తానేటి వనిత గురువారం సాయంత్రం వైసీపీ శ్రేణులతో ‘చాయ్ విత్ పోతవరం కేడర్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై చర్చించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

March 26, 2026 / 08:01 PM IST

ఎక్సైజ్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన దీప్తి

E.G: పేదరికాన్ని జయించి గ్రూప్-2 ద్వారా ఎక్సైజ్ ఎస్సైగా ఎంపికైన కడియం మండలం దామిరెడ్డిపల్లికి చెందిన చింతపర్తి దీప్తి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ అమ్మాయికి పెద్దాపురం సర్కిల్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు దీప్తి ఎక్సైజ్ సీఐకు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి బాధ్యతలు స్వీకరించారు. విద్య వాలంటీర్‌గా పనిచేస్తూ కష్టపడి చదువుకుని విజయాన్ని సాధించారు.

March 26, 2026 / 08:01 PM IST

‘భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి’

ASR: గూడెం కొత్తవీధి మండలం సీలేరులో గురువారం రంపచోడవరం ఓఎస్‌డీ పంకజ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సీలేరులో నూతనంగా నిర్మిస్తున్న పోలీసు స్టేషన్ భవనాన్ని తనిఖీ చేశారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు.

March 26, 2026 / 08:00 PM IST

శాంతియుతంగా పండుగ జరుపుకోవాలి: ఎస్పీ

ATP: జిల్లా ఎస్పీ పి.జగదీష్ శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల సందర్భంగా దేవాలయాల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. శోభాయాత్రలు, కళ్యాణ వేడుకల సమయంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు. శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

March 26, 2026 / 08:00 PM IST

బాటిల్స్‌లో ఇంధనం విక్రయించకూడదు: ఆర్డీవో

NTR: తిరువూరు శ్రీ వెంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ బంక్)ను ఆర్డీవో కుమార్ గురువారం పరిశీలించారు. ఓపెన్ స్టాక్ ఎంత ఉందో స్వయంగా పరిశీలించారు. అనంతరం నిర్వాహకులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అవి బాటిల్స్‌లో ఇంధనం విక్రయించకూడదన్నారు. ఆయిల్ కంపెనీలకు డీడీలు చెల్లిస్తూ ఇంధన నిల్వలు ఉంచాలని సూచించారు. ఇంధన కొరతపై పుకార్లు నమ్మొద్దని వాహనదారులకు తెలిపారు.

March 26, 2026 / 08:00 PM IST

ద్వారకా బస్ స్టేషన్ తనిఖీ

VSP: ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి. అప్పలనాయుడు ద్వారకా బస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. బస్ స్టేషన్ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయని, ప్రయాణికులకు టాయిలెట్, మంచినీటి సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. అలాగే, ఆహ్లాదకర వాతావరణం కోసం ఫిష్ అక్వేరియంను కూడా ఆధునీకరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

March 26, 2026 / 07:57 PM IST

సబ్ జైలు తనిఖీ చేసిన జిల్లా న్యాయమూర్తి

W.G: భీమవరం పట్టణంలోని ఉపకారాగారాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ చైర్‌పర్సన్ S. శ్రీదేవి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ముద్దాయిలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముద్దాయిలు న్యాయవాదులను పెట్టుకోలేకపోతే ఉచిత న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు.

March 26, 2026 / 07:55 PM IST

మార్కాపురం రోడ్డు ప్రమాదం బాధాకరం: దీపిక

సత్యసాయి: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని కలిగించిందని హిందూపురం వైసీపీ ఇన్‌చార్జ్ దీపిక గురువారం పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

March 26, 2026 / 07:52 PM IST

గూడూరులో చలివేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

TPT: గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్, పాత బస్టాండు ప్రాంతాలలో ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ గురువారం చలివేంద్రాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాదచారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు.

March 26, 2026 / 07:50 PM IST

రోడ్ల మీద ప్రవహిస్తున్న మురుగు నీరు

SKLM: ఆమదాలవలసలోని పలు ప్రాంతాలలో గురువారం సాయంత్రం వడగళ్లతో వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా పూజారిపేటలోని పలు వీధుల్లో ఉన్న కాలువల్లో పూడికలు పేరుకుపోవడంతో కాలువలో ఉండే మురికి నీరు రోడ్ల పై ప్రవహిస్తుంది. దీంతో స్థానికులు వాహనదారులు, తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. అధికారులు స్పందించి కాలువల్లో పూడికలు తీయాలని ప్రజలు కోరుతున్నారు.

March 26, 2026 / 07:48 PM IST

‘పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టండి’

NLR: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల,నగరంలోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో గల ఈవీఎం గోడౌన్లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ, ఈవీఎంలు భద్రపరిచిన మూడు గోడౌన్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సంఘం సూచించిన నిబంధనల మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

March 26, 2026 / 07:45 PM IST

గూడూరులో మార్కెట్లకు బహిరంగ వేలం

KRNL: గూడూరులో ఉన్న మార్కెట్లకు బహిరంగంగా వేలం ప్రకటిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ రమేశ్ బాబు పేర్కొన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రోజువారీ కురగాయాల మార్కెట్, వారపు సంత, గొర్రెలు, పెద్ద పశువుల కమేళ, తదితర మార్కెట్లకు శనివారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో బహిరంగంగా వేలం ప్రకటిస్తున్నామన్నారు. వేలంలో పాల్గొనే వారు సంబంధిత దస్తావేజులు తీసుకురావాలన్నారు.

March 26, 2026 / 07:40 PM IST