• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి’

ASR: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందించాలని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, సానుకూల స్పందనపై దృష్టి సారించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గురువారం ఐటీడీఏలో అధికారులతో సమావేశమయ్యారు. గిరిజన సంక్షేమ విద్యా సంస్థల పనితీరుపై దృష్టి సారించాలన్నారు

March 26, 2026 / 07:36 PM IST

‘కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి’

E.G: జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో గురువారం 9వ అదనపు జిల్లా జడ్జి ఎమ్.మాధురి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో న్యాయవాదులతో మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులతో ఆయా కేసుల పురోగతిని సమీక్షించారు. కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

March 26, 2026 / 07:35 PM IST

సీఎం చంద్రబాబుతో జిల్లా నేతల భేటీ

ATP: జిల్లాలో విశేష సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థకు FCRA రెన్యూవల్ చేయించినందుకు CM చంద్రబాబుకు ఎమ్మెల్యేలు సురేంద్ర బాబు, కాలువ శ్రీనివాసులు, మంత్రి సవిత కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలో గురువారం ముఖ్యమంత్రిని కలిసి ఘనంగా సన్మానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడి రెన్యూవల్ అయ్యేలా కృషి చేసినందుకు జిల్లా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు.

March 26, 2026 / 07:34 PM IST

నాగిరెడ్డికి మనోధర్యం చెప్పిన శాసనమండలి ఛైర్మన్

కృష్ణా: నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి ఈరోజు పర్యటించారు. ఈ క్రమంలో వ్యవసాయ మిషన్ మాజీ ఛైర్మన్ నాగిరెడ్డిని కలిసి ఆయనకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మాతృవియోగం కుటుంబానికి తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. మనోధర్యంతో ఉండాలని నాగిరెడ్డికి సూచించారు.

March 26, 2026 / 07:34 PM IST

బస్ షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు

PPM: సీతానగరం మండల కేంద్రంలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిలకు గురవుతున్నామన్నారు. గురువారం శ్రీ లక్ష్మి నరసింహస్వామి ముడుపుల పూజ కారణంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ప్రయాణికులు తెలిపారు. తీవ్ర ఎండలు దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు చొరవతీసుకొని బస్ షెల్టర్ నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

March 26, 2026 / 07:33 PM IST

స్వచ్ఛ ధర్మవరం దిశగా కీలక అడుగు

సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ధర్మవరం రూరల్ మండలంలోని గ్రామ పంచాయతీలకు ట్రై సైకిళ్లు, పుష్‌కార్ట్స్, డస్ట్‌బీన్లను పంపిణీ చేశారు. గురువారం టౌన్ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో హరీష్ బాబు, టీడీపీ నేత చింతపల్లి మహేష్ పాల్గొన్నారు. మండలంలోని గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ పరికరాలను అందజేశారు.

March 26, 2026 / 07:33 PM IST

కాళ్లకూరు శ్రీవారి హుండీ లెక్కింపు

W.G: కాళ్లకూరులో వేంచేసియున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం హుండీ లెక్కింపు నిర్వహించారు. 75 రోజులకుగాను స్వామివారి హుండీ లెక్కించగా రూ.16,61,147 వచ్చాయని దేవస్థానం ఈవో ఎం.అరుణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమేశ్వరస్వామి దేవస్థానం ఈవో కూచంపూడి శ్రీనివాసరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.

March 26, 2026 / 07:32 PM IST

పేకాట స్థావరంపై దాడి.. 2 మంది అరెస్ట్

GNTR: నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదపలకలూరు గ్రామ కొండ ప్రాంతంలో పేకాట జరుగుతున్నట్టు సమాచారం అందడంతో గురువారం టాస్క్ ఫోర్స్, ఎస్‌బీ సిబ్బంది సంయుక్తంగా దాడి చేపట్టారు. ఈ దాడిలో నిర్వాహకుడు ఎస్‌కే అలీతో పాటు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 11 సెల్‌ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, రూ.61,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.

March 26, 2026 / 07:30 PM IST

వికృతమాలలో సీతారాముల ఆలయ కుంభాభిషేకం

TPT: ఏర్పేడు మండలం వికృతమాల కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల దేవాలయంలో మహా కుంభాభిషేకం మూడు రోజుల పాటు వైభవంగా జరుగుతోంది. దాతల సహకారంతో ఆలయ నిర్మాణం పూర్తికాగా, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థానిక నాయకులు ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు పార్టీలకు అతీతంగా వేడుకలు నిర్వహించారు. వేద పండితుల పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు చేశారు.

March 26, 2026 / 07:30 PM IST

కడపలో క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్

కడపలో అక్రమ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.17,98,500 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో భగత్ సింగ్ పార్క్ సమీపంలోని సంగం ఫంక్షన్ హాల్ వద్ద దాడి చేసి నిందితులను పట్టుకున్నారు.

March 26, 2026 / 07:29 PM IST

జర్నలిస్టులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు

VZM: జిల్లాలో అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఈనెల 28 నుంచి ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచార శాఖ సహాయ సంచాలకులు పి. గోవిందరాజులు గురువారం తెలిపారు. తిరుమల మెడికవర్ ఆసుపత్రిలో బ్యాచ్‌ల వారీగా పరీక్షలు నిర్వహించనున్నారు. ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని జర్నలిస్టులకు సూచించారు.

March 26, 2026 / 07:28 PM IST

పోలమాంబ జాతర ఏర్పాట్లపై సమీక్ష

VSP: పెదవాల్తేరు ప్రాంతంలోని శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 21 వరకు జరిగే జాతరలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. క్యూలైన్, ట్రాఫిక్ నియంత్రణ, జీవీఎంసీ శానిటేషన్, నిరంతర విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టాలన్నారు.

March 26, 2026 / 07:26 PM IST

ఘనంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు జన్మదిన వేడుకలు

SKLM: పాతపట్నం నియోజకవర్గంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వేలాది మందికి సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు కలమట వెంకటరమణ, జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

March 26, 2026 / 07:25 PM IST

ఒంటరితనంతో వృద్ధుడి ఆత్మహత్య

NDL: కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంట సమీపంలోని అల్ట్రాటెక్ సిమెంట్ కాలనీలో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాసుతకర్ హరిరావు (72) భార్య మరణం తర్వాత ఒంటరితనాన్ని తట్టుకోలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కుమారుడు నరసింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రమేశ్ బాబు గురువారం తెలిపారు.

March 26, 2026 / 07:24 PM IST

బస్సు ప్రమాదం.. తల్లీ కుమార్తె మృతి

NLR: మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సుప్రమాదంలో కొండాపురం మండలం తూర్పు యర్రబల్లికి చెందిన తల్లీ, కుమార్తె గురువారం మృతి చెందారు. తూర్పు యర్రబల్లికి చెందిన నర్సింగు శ్రీను, అతని భార్య ప్రభావతి, కుమార్తె చైత్ర పనులు చేసుకుంటూ జగిత్యాలలో నివాసం ఉంటున్నారు. ఆమె తన పుట్టింటికి తిరిగి వస్తుండగా బస్సు ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరు మృతి చెందారు.

March 26, 2026 / 07:13 PM IST