ASR: అత్యవసర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు పాడేరు జనరల్ ఆసుపత్రిలో శనివారం మాస్ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గాయపడిన వారికి వైద్యం అందించడం, రోగుల తరలింపు డ్రిల్‌లో ప్రదర్శించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంపై అవగాహన కల్పించామన్నారు.
బాపట్ల: అద్దంకి మండలం పంగులూరు గ్రామంలో విద్యుత్ సరఫరా మెరుగుపరచేందుకు రూ.1.44 కోట్ల వ్యయంతో చేపట్టిన ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు గ్రామంలో 570 నూతన విద్యుత్ స్తంభాలు, 5 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి కొత్త విద్యుత్ లైన్లు నిర్మించారు. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా ఉండనుంది.
కోనసీమ: అమరజీవి జలధార వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా మలికిపురంలో వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలలో ప్రధానంగా ఇచ్చిన హామీ ఇంటింటికి మంచినీరు అందిస్తామని ఆ హామీ నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. గ్రామాలలో ఇంటింటికి మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ATP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అధ్యక్షతన కళ్యాణదుర్గంలోని ప్రజావేదికలో వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా బసవతారకం ఆసుపత్రికి చెందిన 15 మంది నిపుణులతో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు రెండో రోజు సమ్మెను శనివారం కొనసాగించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లేదని, రాష్ట్ర బడ్జెట్లో కార్మికులకు ప్రభుత్వం మొండిచేయి చూపిందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పైపల్లి గంగాధర్ పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు తమ పోరాటం ఆగదన్నారు.
E.G: అంబేద్కర్ ఆశయాలు, ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానా పేర్కొన్నారు. శనివారం ధవళేశ్వరంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఛైర్మన్ ఆవిష్కరించారు. అంబేద్కర్‌ను రాజ్యాంగ నిర్మాతగానో, దళిత నాయకుడుగానో, ప్రపంచ నేతగా గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
VZM: సివిల్ సర్వీస్ పరీక్షలలో 640 ర్యాంకును సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తెచ్చిన పల్లి ప్రమోద్ విష్ణు, కలక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డిని శనివారం కలక్టర్ క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. విష్ణు ప్రస్తుతం సికింద్రాబాద్ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారిగా పని చేస్తున్నారు.
కర్నూలు: కలెక్టర్ సిరి అధికారులతో ఇవాళ సమావేశం నిర్వహించి జిల్లాలో తలసరి ఆదాయం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో మరింత పురోగతి సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపరచాలని అధికారులకు తెలిపారు.
NDL: ఆత్మకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధిలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చేస్తున్న కృషి అభినందనీయమని జనసేన యువ నాయకులు అరుణ్ కుమార్, ప్రదీప్ కుమార్ ఇవాళ తెలిపారు. కళాశాలలో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య అందిస్తూ విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో కూడా కళాశాల మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
VSP: గాజువాక నియోజకవర్గంలోని 87వ వార్డు కణితి కాలనీకి చెందిన గుమ్మాల రాజబాబు కుమార్తె శ్వేత సివిల్స్ పరీక్షల్లో 573వ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా వడ్లపూడి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆమెను శనివారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మహేష్‌తో పాటు మధు, ఆర్‌వీ సుధాకర్, ఆర్‌వీ శ్రీనివాసులు, గోవింద్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి నియోజకవర్గంలో ఆర్.అండ్.బీ రహదారుల అభివృద్ధికి రూ.5.10 కోట్లు నిధులు మంజూరైనట్లు కూటమి నేతలు నాగేశ్వరరావు, వెంకట సన్యాసినాయుడు, తాతారావు తెలిపారు. శనివారం అనకాపల్లి జనసేన కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ చొరవతో నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు.
SKLM: వేసవి కాలంలో గొర్రెలు, మేకలు వంటి పశువుల పెంపకంలో శాస్త్రీయ పద్ధతులు పాటించకపోతే మూగజీవాలు మరణించే ప్రమాదం ఉందని పశుసంవర్ధక శాఖ ఏడి జి. నారాయణరావు అన్నారు. ఆమదాలవలస మండలంలోని పలు గ్రామాలను శనివారం సందర్శించి పాడి రైతులతో మాట్లాడారు. వేసవిలో పశువులకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.
VSP: చీపురుపల్లి నియోజకవర్గ వైసీపీ పరిశీలకులుగా నియమితులైన విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి శనివారం జిల్లా పార్టీ అధ్యక్షుడు కె.కె. రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ELR: గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ నిధులు వరం లాంటిదని సర్పంచ్ దిడ్ల అలకనంద అన్నారు. శనివారం ఉంగుటూరు(M) నారాయణపురంలో ఉపాధి హామీ నిధులు రూ.40 లక్షలతో గీతాంజలి స్కూల్ నుంచి పాతూరు సత్యనారాయణ పొలం, టైల్ ఫ్యాక్టరీ రోడ్డు వరకు సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే ధర్మరాజు కృషితో ఈ పనులు చేస్తున్నామని సర్పంచ్ తెలిపారు.
విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా శనివారం డీఎస్పీ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు ఎస్పి పి.సౌమ్యలత పాల్గొని రక్తదాతలను ప్రశంసా పత్రాలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ కె ప్రసాద్ రావు పాల్గొన్నారు.