• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శ్రీశైలానికి మత్తుపదార్థాలు తీసుకు రాకండి: సీఎస్‌వో

నంద్యాల: నిషేధిత వస్తువులను శ్రీశైలం ఆలయ ప్రాంగణంలోకి తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎస్‌వో శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆలయ సమీపంలోని టోల్ గేట్ వద్ద వాహనాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. ఎటువంటి మత్తు పదార్థాలను తీసుకు రావద్దని సూచించారు. ఆలయ ప్రాంగణంలోకి అన్యమత ప్రచార వస్తువులను తీసుకువస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 6, 2026 / 05:33 PM IST

‘టవర్ల నిర్మాణ పనులు సత్వరమే పూర్తి చేయాలి’

PPM: జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీని మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన క్యాటగిరీ-5, క్యాటగిరీ-6 మొబైల్ టవర్ల నిర్మాణ పనులను సత్వరమే పూర్తి చేయాలని జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో బి.ఎస్.ఎన్.ఎల్.అధికారులు, ఏడీఈలతో జిల్లాలో టవర్ల ఏర్పాటు పురోగతిపై ఆయన సమీక్షించారు.

March 6, 2026 / 05:33 PM IST

‘ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి’

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను రానున్న డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కనిగిరి సుందరయ్య భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు 1000 వరకు ఖాళీలు ఉన్నప్పటికీ గతంలో కేవలం 120 ఎస్‌జీటీ పోస్టులు మాత్రమే విడుదల చేశారని విమర్శించారు.

March 6, 2026 / 05:32 PM IST

పెనుగంచిప్రోలులో పర్యటించిన నీతి ఆయోగ్ బృందం

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం, సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమాల అమలును పరిశీలించేందుకు నీతి ఆయోగ్ అధికారి రాధిక మూలయా పర్యటించారు. ముళ్లపాడు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, చెత్త సేకరణ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రభుత్వ వైద్యశాలను సందర్శించినట్లు ఆమె తెలిపారు.

March 6, 2026 / 05:30 PM IST

మంత్రి వాసంశెట్టి రాజీనామా చేయాలి: AITUC

KDP: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడులో 28 మంది మృతికి బాధ్యత వహిస్తూ కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్ రాజీనామా చేయాలని AITUC డిమాండ్ చేసింది.బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కడప AITUC నాయకుడు కేసీ బాదుల్లా కోరారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని వారు మండిపడ్డారు.

March 6, 2026 / 05:30 PM IST

సీజనల్ వ్యాధులపై కలెక్టర్ సమీక్ష

కర్నూలు: కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ డా.ఏ.సిరి నిర్వహించారు. విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లో నీటి నమూనాలను 15 రోజులకు ఒకసారి సేకరించి పరీక్షించాలని ఆమె ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. పరిశుభ్రమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

March 6, 2026 / 05:29 PM IST

‘డ్వాక్రా మహిళలు సహకరించాలి’

AKP: శత శాతం ఇంటి పన్నుల వసూళ్లకు డ్వాక్రా మహిళలు సహకరించాలని ఎస్.రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం వమ్మవరంలో డ్వాక్రా మహిళల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇంటి పన్నులు ఇంతవరకు చెల్లించని వారు వెంటనే చెల్లించి పంచాయతీల అభివృద్ధికి సహకరించాలని కోరారు.

March 6, 2026 / 05:26 PM IST

పీఎం నరేంద్ర మోడీ లైవ్‌ను వీక్షించిన రైతన్నలు

NLR: విడవలూరు మండలంలోని దంపూరు రైతు సేవ కేంద్రం పరిధిలో పోస్ట్ బడ్జెట్ webinar కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లైవ్ టెలికాస్ట్‌ను రైతులు వీక్షించారు. ఈ కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి ముఖ్యంగా వ్యవసాయ, అనుబంధ శాఖల యొక్క అభివృద్ధి, పురోగతిపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఏవో లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

March 6, 2026 / 05:25 PM IST

ఇరాన్‌పై యుద్ధం ఆపాలని సీపీఎం నిరసన ర్యాలీ

ATP: అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై చేస్తున్న దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ గుంతకల్లు సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతి ప్రసాద్ మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయిల్ లాంటి దేశాలు ఖనిజ సంపద ఉన్న ఇరాన్ దేశం‌‌‌పై దాడి చేయడం చాలా దారుణం అన్నారు.

March 6, 2026 / 05:20 PM IST

ఆర్డీటీని కాపాడుకుందామని అఖిలపక్షం పిలుపు

సత్యసాయి: ధర్మవరంలో ‘ఆర్డీటీని రక్షించుకుందాం’ అనే నినాదంతో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దశాబ్దాలుగా అనంత ప్రజల జీవనాడిగా మారి పేదలకు సేవలు అందిస్తున్న ఆర్డీటీ సంస్థపై ప్రతికూల చర్యలు ఆపాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ సంస్థ ప్రతి గడపకూ చేరువైందని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు.

March 6, 2026 / 05:20 PM IST

కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా

కర్నూలు: మధ్యాహ్న భోజన కార్మికులు స్కూల్ స్కావెంజర్లు, నైట్ వాచ్‌మెన్‌లకు వేతనాలు పెంచి, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు అమలు చేసి, ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. డీఆర్వో సి.వెంకటనారాయణమ్మకు వినతిపత్రం అందించారు.

March 6, 2026 / 05:20 PM IST

ఇంటి పన్ను వసూళ్లను పరిశీలించిన పంచాయతీ అధికారి

ప్రకాశం: కంభంలో ఇంటి పన్ను వసూళ్లను జిల్లా పంచాయతీ అధికారి ఎం. వెంకటేశ్వరరావు శుక్రవారం పరిశీలించారు. మార్చి 15 నాటికి ఇంటి పన్నులు 100 శాతం వసూలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రత్యేక బృందాలతో సమీక్ష నిర్వహించి వసూళ్లు వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ విజయలక్ష్మి, బ్రహ్మయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

March 6, 2026 / 05:20 PM IST

ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసీ రంగం కీలకం: అశోక్

W.G: ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసీ రంగం కీలకమని ప్రిన్సిపల్ టి.అశోక్ అన్నారు. ఫార్మసీ పితామహుడు మహాదేవ్ లాల్ ప్రాఫ్ జయంతి సందర్భంగా శుక్రవారం తాడేపల్లిగూడెం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ క్యాంపస్ జాతీయ ఫార్మసీ విద్యా దినోత్సవం నిర్వహించారు. ఫార్మసీ విద్యార్థులు నైతిక విలువలు, సేవ భావంతో ప్రజలకు సేవలు అందించాలన్నారు.

March 6, 2026 / 05:19 PM IST

మాచర్లలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించిన సీఐ

PLD: మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మాచర్ల అర్బన్ సీఐ వెంకటరమణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లో విధులు ఏ విధంగా ఉంటాయని, ఎవరు ఎలా విధులు నిర్వహిస్తారని విద్యార్థులకు వివరించారు.

March 6, 2026 / 05:18 PM IST

‘ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి’

కడప: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి డా.హరి కొండయ్య తెలిపారు. సిద్దవటం ZP ఉన్నత పాఠశాలలో బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి మార్చి 12 వరకు జరుగు నిరసనలో భాగంగా ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్ ధరించి విధులకు హాజరయ్యారు.

March 6, 2026 / 05:17 PM IST