• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

విశాఖలో కరాటే ఛాంపియన్‌షిప్ ప్రారంభం

VSP: మురళీనగర్‌లోని బొత్స కన్వెన్షన్‌లో 15వ ఏపీ రాష్ట్ర వడోకై కరాటే ఛాంపియన్‌షిప్-2026 ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి వైసీపీ పార్టీ విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి హాజరయ్యారు. ఈ వేడుకలో సినీ నటుడు సుమన్ తల్వార్, బీజేపీ నాయకుడు బొత్చా సురేష్ కుమార్ పాల్గొన్నారు.

March 2, 2026 / 07:58 PM IST

యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ సమన్వయ సమావేశం

TPT: మార్చి 03 నుంచి 05 వరకు తిరుపతి-తిరుమలలో ఎన్‌ఎస్‌‌జీ ఆధ్వర్యంలో యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. మార్చి 03న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద, 04-05 తేదీలలో తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో డ్రిల్ జరుగుతుంది. ఇది కేవలం భద్రతా సాధన కార్యక్రమమేనని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు.

March 2, 2026 / 07:56 PM IST

ఆంజనేయస్వామి ఆలయం వద్ద పంచలోహ ఉత్సవమూర్తి

TPT: సత్యవేడు పట్టణంలోని శ్రీఅభయ ఆంజనేయస్వామి ఆలయానికి పంచలోహాలతో రూపొందించిన ఉత్సవమూర్తి విగ్రహం సిద్ధమైంది. ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు నిర్వహించి, అనంతరం ఉత్సవమూర్తిని పట్టణంలో ఘనంగా ఊరేగించనున్నారు. ధర్మకర్త నాగభూషణం స్వంత నిధులు, భక్తుల విరాళాలతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

March 2, 2026 / 07:55 PM IST

రైతులకు 24 గంటల్లో డబ్బులు జమ చేస్తాం: డీసీవో

NLR: ధాన్యం రైతులకు 24 గంటల్లో నగదు చెల్లింపు చేస్తామని డీసీవో బి. గురప్ప స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మినగల్లు గ్రామంలో పర్యటించి రైతులకు పలు సూచనలు చేశారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు పూర్తిస్థాయిలో ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడానికే కృషి చేస్తామన్నారు.

March 2, 2026 / 07:50 PM IST

ఘనంగా మహిళ దినోత్సవ వారోత్సవాలు

VZM: జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో మహిళ దినోత్సవ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్ధులకు సోమవారం పెయింటింగ్, డ్రాయింగ్, వక్తృత్వ, వ్యాస రచన పోటీలు, మహిళలు, పిల్లల రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. విజేతలకు ముగింపు రోజు బహుమతులు అందజేస్తారు.

March 2, 2026 / 07:50 PM IST

ఉద్యోగ సంఘ నేతలు ఎమ్మెల్యేకు వినతి

PPM: వివిధ విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల ఆర్థికపరమైన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి పరిష్కరించాలని కోరుతూ ఏపీటీఎఫ్ ఉద్యోగ సంఘాల నాయకులు ఎమ్మెల్యే విజయ్ చంద్రకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు బకాయిలు చెల్లించాలన్నారు. అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన 4 డీఏలు విడుదల చేయాలన్నారు.

March 2, 2026 / 07:50 PM IST

‘బాలల ఆరోగ్యకరమైన భవిష్యత్ ధ్యేయంగా సేవలందించాలి’

PPM: బాలల ఆరోగ్యకరమైన భవిష్యత్ ధ్యేయంగా సేవలందించాలని జిల్లా ఆర్.బి.ఎస్.కె అధికారి డా. టి. జగన్ మోహనరావు సూచించారు. జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ప్రతీ రోజూ పిల్లలకు అందుతున్న ఆరోగ్య సేవలు మరియు మెరుగవుతున్న తీరుపై సిబ్బందితో సమీక్షించారు. 4Dలుగా గుర్తింపబడిన శారీరిక ,మానసిక వైకల్యం, ఎదుగుదల తనికీలు నిర్వహిచారు.

March 2, 2026 / 07:43 PM IST

ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్న విద్యార్థులు

శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస మీదుగా పాలకొండ వెళ్లే బస్సుల్లో విద్యార్థులు ఫుట్‌ బోర్డుల పై వేలాడుతూ ప్రయాణించడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. కళాశాలలు ముగిసే సమయానికి తగిన బస్సులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణిస్తున్నారు. అధికారులు స్పందించి అదనపు బస్సులు నడపాలని విద్యార్థులు కోరుతున్నారు.

March 2, 2026 / 07:42 PM IST

గురుకులాన్ని పరిశీలించిన పీఎం శ్రీ కమిటీ మెంబర్

W.G: తాడేపల్లిగూడెం (M) పెదతాడేపల్లి డాక్టర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సోమవారం పీఎంశ్రీ ప్రోగ్రాం సెంట్రల్ కమిటీ మెంబర్ హేమ జైస్వాల్ పరిశీలించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలను ఆమె తనిఖీ చేశారు. పీఎం శ్రీ ద్వారా కేంద్ర ప్రభుత్వం కల్పించిన ల్యాబ్, స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ క్లాసు రూమ్, అటెండెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ గురించి తెలుసుకున్నారు.

March 2, 2026 / 07:40 PM IST

హాస్టల్ సమస్యలపై పోస్టు కార్డుల ఉద్యమానికి శ్రీకారం

అనంతపురం నగరంలోని ఎస్సీ హాస్టల్లో సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుకు సంక్షేమ హాస్టల్ సమస్యల పరిష్కారం కోరుతూ పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు పరమేష్ మాట్లాడుతూ.. పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ చార్జీలు రూ. 3000కు పెంచాలని, సంక్షేమ హాస్టల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

March 2, 2026 / 07:40 PM IST

డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ

ASR: జిల్లాలోని 11 మండలాలకు చెందిన గిరిజన యువతకు 45 రోజుల పాటు ఉచిత డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ సోమవారం తెలిపారు. అరకు డిగ్రీ కళాశాల హాస్టల్లో 120 మంది యువతీ యువకులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 10వ తరగతి పాసైన ఆసక్తి గల యువత పాడేరు ఐటీడీఏలో ధరఖాస్తు చేసుకోవాలన్నారు.

March 2, 2026 / 07:37 PM IST

చిలకలూరిపేటలో పడకేసిన పారిశుధ్యం

PLD: పట్టణంలోని పురుషోత్తపట్నం ప్రాంతంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా స్థానిక ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూతూమంత్రంగా ప్లాస్టిక్ వ్యర్థాల తొలగించ లేదన్నారు. పురుషోత్తపట్నం ఆర్చి వద్ద ఉన్న కల్వర్టులో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయి నీరు నిల నిల్వ ఉందన్నారు.

March 2, 2026 / 07:32 PM IST

దుగ్గిరాల వద్ద వింత ప్రమాదం.. చెట్టు కొమ్మల్లోకి బైక్

GNTR: దుగ్గిరాల లాకు వద్ద సోమవారం బైక్ ప్రమాదం స్థానికంగా చర్చనీయాంశమైంది. చినరావూరుకు చెందిన కిషోర్, విజయ్ ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురవ్వగా, ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. విచిత్రమేమిటంటే, ప్రమాద తీవ్రతకు బైక్ పది అడుగుల ఎత్తులో చెట్టు కొమ్మల్లో చిక్కుకుపోయింది. గాయపడిన వారిని చికిత్స కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 2, 2026 / 07:30 PM IST

ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచిన ఎమ్మెల్యే

NLR: బుచ్చి పట్టణంలోని కరిముల్లా తోపుడు మిషన్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగి లక్ష రూపాయలు నష్టం జరిగిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక టీడీపీ నాయకుడు రామానాయుడు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వేమిరెడ్డి దంపతులు వారికి 50 వేల రూపాయలను సహాయాన్ని అందజేశారు. వేమిరెడ్డి దంపతులకు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు.

March 2, 2026 / 07:30 PM IST

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు: SI

KDP: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిద్ధవటం ఎస్సై పోకల హారిక హెచ్చరించారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె మాట్లాడుతూ.. మండలంలో కోడి పందేలు, జూదం,పేకాట నిర్వహిస్తే కఠినమైన చర్యలు తప్పవన్నారు. రౌడీ షీటర్లు పల్లెల్లో ప్రశాంతత వాతావరణం ఉండేటట్లు కలిసిమెలిసి ఉండాలన్నారు. అనుమానిత పల్లె ప్రాంతాలపై కొంతమందిపై నిఘా వేసి ఉంచామని తెలిపారు.

March 2, 2026 / 07:27 PM IST