• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రైతులు ఆనందంగా లేరు: సీపీఎం

NLR: ఇఫ్కో కిసాన్ సెజ్ కి భూములు ఇచ్చిన రైతులు ఆనందంగా లేరని సీపీఎం నాయకులు గోని దయాకర్ తెలిపారు. కొడవలూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉన్నారని ప్రజాప్రతినిధులు మాట్లాడడం దారుణం అన్నారు. ఎరువులు కర్మాగారం ఏర్పాటు చేస్తామని రైతులు సాగు చేసుకుంటున్న భూములను స్వాధీనం చేసుకుని సహాయం చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.

March 2, 2026 / 08:13 PM IST

అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: ఎస్పీ

KKD: PGRS అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ బిందుమాధవ్ అధికారులకు సూచించారు. సోమవారం కాకినాడ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో 44 మంది ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

March 2, 2026 / 08:10 PM IST

గూడూరులో మితిమీరుతున్న హిజ్రాల ఆగడాలు

TPT: గూడూరు, తిప్పవరపాడు పరిసర ప్రాంతాలలో హిజ్రాల నిలువు దోపిడీ చేస్తున్నారు. పరువు భయంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. జేబుల్లో చేతులు బట్టలు విప్పేసి బరి తెగిస్తున్నారు. ఓ మహిళ నా దగ్గర లేవు అంటున్నా బ్యాగ్ చూపించు అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. దీనిపై స్పందించాల్సిన పోలీసులు తమకు ఫిర్యాదులు రాలేదంటూ మిన్నకుంటుండడంతో హిజ్రాలు ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి.

March 2, 2026 / 08:10 PM IST

‘పెద్ద నాగులవరంలో ఆక్రమణలు తొలగింపు’

ప్రకాశం: మార్కాపురం మండలం పెద్దనాగులవరం గ్రామంలో సెంటు వాగు పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి పశువుల షెడ్డు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నట్లు సోమవారం ఎమ్మార్వో కార్యాలయానికి ఫిర్యాదు వచ్చింది. ఈ క్రమంలో ఎమ్మార్వో చిరంజీవి ఆ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా షెడ్డు నిర్మించిన వారిని షెడ్డు నిర్మించడానికి గుర్తించి, నోటీసులు ఇచ్చారు.

March 2, 2026 / 08:09 PM IST

హోలీ సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

విజయనగరం నియోజకవర్గం గోసంరక్షణ సమితిలో మార్వాడి కమ్యూనిటి వారు ముందుస్తుగా ఏర్పాటుచేసిన హోలీ సంబరాలలో సోమవారం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పాల్గొన్నారు. ఈసందర్బంగా చిన్నా, పెద్దా అంతా ఒ‌క దగ్గర చేరి రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. రసాయనాలు కలిపిన రంగులు కాకుండా సహజ రంగులు వాడాలని సూచించారు.

March 2, 2026 / 08:08 PM IST

‘ఉద్యమి సభ్యత్వం విజయవంతం చేయాలి’

VSP: జనసేన పార్టీ ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సోమవారం సీతంపేట పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. సభ్యత్వం పార్టీ బలోపేతానికి కీలకమని, బూత్ స్థాయి నుంచి పటిష్టం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఇది ముఖ్యమని తెలిపారు.

March 2, 2026 / 08:07 PM IST

డ్రంక్ అండ్ డ్రైవ్.. 9 మందికి రూ.90 వేల జరిమానా

CTR: మద్యం సేవించి వాహనాలు నడిపిన 9 మందిని పోలీసులు పట్టుకుని 1st స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.90,000 జరిమానా విధించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు.

March 2, 2026 / 08:05 PM IST

మహిళ దినోత్సవ సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ

TPT: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కే.ఆర్. సూర్యనారాయణ భారీ సదస్సుకు సంబంధించిన గోడపత్రికను కాళహస్తిలోని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాలలో మహిళల పాత్ర కీలకమని, మహిళా ఉద్యోగుల సమస్యలు, వారి హక్కులను వివరించారు.

March 2, 2026 / 08:05 PM IST

అంతరాష్ట్ర ఎర్రచందన స్మగ్లర్లు అరెస్ట్

TPT: తిరుపతి అదనపు ఎస్పీ కులశేఖర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎర్రచందన స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 195 ఎర్రచందనం దుంగలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.5 కోట్లు ఉంటుందని తెలిపారు. బృందాన్ని అభినందిస్తూ అధికారులకు రివార్డులు ప్రకటించారు. 

March 2, 2026 / 08:04 PM IST

గుంటూరు అభివృద్ధిపై పెమ్మసాని సమీక్ష

GNTR: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన సోమవారం జరిగిన జీఎంసీ సమీక్షలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. నార్ల ఆడిటోరియం పనులు మార్చి 16న ప్రారంభమవుతాయని, డ్రెయిన్లలో పూడికతీత పనులు మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ముస్లింల కోసం ఖబరస్థాన్‌ స్థల కేటాయింపు, వీధి కుక్కల నియంత్రణ, వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఆదేశించారు.

March 2, 2026 / 08:00 PM IST

ఉపాధి హామీ గోడపత్రికలను ఆవిష్కరించిన కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లో జిల్లా నీటి యాజమాన్య సంస్థ రూపొందించిన వికసిత్ భారత్ జీరాంజీ ఉపాధి హామీ గోడ పత్రికలను కలెక్టర్ బాలాజీ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీరాంజీ పథకం 2026-2027 ఆర్థిక సంవత్సరం నుండి అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్, అధికారులు పాల్గొన్నారు.

March 2, 2026 / 08:00 PM IST

తాగునీటి పనులు వేగవంతం చేయండి: ఎమ్మెల్యే

అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలాల్లో జల జీవన్ మిషన్ పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ నిధుల మంజూరుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రూ.90 కోట్లకు పైగా వ్యయంతో జరుగుతున్న ఈ పనుల ద్వారా 50 గ్రామాలకు తాగునీరు అందుతుందని వివరించారు.

March 2, 2026 / 08:00 PM IST

మహిళల భద్రతకు ప్రాధాన్యం: ఎస్పీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. కోటిరెడ్డి సర్కిల్ నుంచి సెవెన్ రోడ్స్ వరకు జరిగిన ర్యాలీని SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు కాల్ చేయాలని సూచించారు.

March 2, 2026 / 08:00 PM IST

ఓపెన్ స్కూల్ పరీక్షా కేంద్రంలో జేసీ ఆకస్మిక తనిఖీ

W.G: భీమవరం చినరంగనిపాలెం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియట్ పరీక్షలను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాల్ టిక్కెట్లు, సీటింగ్ ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షలు నిబంధనలకు అనుగుణంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

March 2, 2026 / 08:00 PM IST

హోలి సెలవు తేదీ మార్పు: డీఈవో

కర్నూలు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు హోలి పండుగ సెలవును మార్చినట్లు డీఈవో సుధాకర్ సోమవారం తెలిపారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 4న ఉన్న సెలవును 3కి మార్చినట్లు పేర్కొన్నారు. 3న సెలవు, 4న 10వ తరగతి గ్రాండ్ టెస్ట్, 9వ తరగతి SA-2 పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు.

March 2, 2026 / 08:00 PM IST