• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

VRSల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్‌కు వినతి

KDP: సమాన పనికి సమాన వేతనం కింద రూ. 26వేలు జీతం చెల్లించాలని VRA అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటపతి డిమాండ్ చేశారు. సోమవారం సిద్ధవటం తహసీల్దార్ ఆకుల తిరుమల బాబుకు వినతిపత్రం సమర్పించారు. సమస్యల పరిష్కారం కోసం జూన్ 6న నిర్వహించబోయే ‘చలో విజయవాడ’లో వీఆర్ఏలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.

March 2, 2026 / 05:00 PM IST

మంగళగిరి పాఠశాలల్లో డీఈవో ఆకస్మిక తనిఖీలు

GNTR: గుంటూరు జిల్లా డీఈవో సోమవారం మంగళగిరిలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వీవర్స్ కాలనీ, ఆత్మకూరు పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి, బోధన తీరుపై ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యా ప్రమాణాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూనే, వాటిని మరింత మెరుగుపరచాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు.

March 2, 2026 / 05:00 PM IST

‘జనాభాగంలో దేశ అభివృద్ధి ప్రణాళికలకు పునాది లాంటిది’

కృష్ణా: మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ ఆడిటోరియంలో భారతదేశ జనాభా గణన-2027 కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనాభా గణన కార్యక్రమం దేశ అభివృద్ధి ప్రణాళికలకు పునాది వంటిదని, ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారం సరిగ్గా, పారదర్శకంగా నమోదు చేయాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని తెలిపారు.

March 2, 2026 / 05:00 PM IST

ఆశా వర్కర్ కుటుంబానికి రూ. 10 వేల ఆర్థిక సాయం

సత్యసాయి: కుమ్మరవండ్లపల్లి పంచాయతీ చర్చి వీధికి చెందిన ఆశా వర్కర్ సరస్వతి అనారోగ్యంతో మృతి చెందగా, ఆమె కుటుంబానికి వైసీపీ రాష్ట్ర బీసీ విభాగం ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తల హరిప్రసాద్ ఆర్థిక సాయం అందించారు. మరణవార్త తెలిసిన వెంటనే స్పందించిన ఆయన, తన తండ్రి మాజీ సర్పంచ్ బత్తల వెంకటరమణ ద్వారా దహన సంస్కారాల కోసం రూ. 10,000 నగదును అందజేశారు.

March 2, 2026 / 05:00 PM IST

పెళ్ళేరులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

NLR: చేజర్ల మండలం పెళ్ళేరు పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో MGNREGS నిధుల కింద 13 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను సోమవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చేజర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్.సిరాజుద్దీన్ చేజర్ల మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 05:00 PM IST

ఇంటి పన్నుల బకాయిలపై దృష్టి

AKP: గొలుగొండ మండలం ఏఎల్.పురం పంచాయతీలో బకాయి ఉన్న ఇంటి పన్నులపై సోమవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు పాల్గొని బకాయి ఉన్న యాజమానులతో స్వయంగా మాట్లాడారు. ఇంటి పన్ను బకాయి ఉన్నవారు ఈనెల 10వ తేదీలోపు తప్పనిసరిగా చెల్లించాలని కోరారు. చెల్లించని వారిపై పంచాయతీ చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 2, 2026 / 05:00 PM IST

‘వేసవిలో జాగ్రత్తలు తీసుకోవాలి’

VZM: వేసవి నేపథ్యంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల పట్ల ప్రతీఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చీపురుపల్లి ప్రాంతీయ హాస్పిటల్ సివిల్ సర్జన్ డాక్టర్ కృష్ణారావు సోమవారం తెలిపారు. మార్చి ప్రారంభానికి ఎండలు పెరిగిపోతున్నాయని, ఏప్రిల్, మే, జూన్‌లో ఇంకా ఎక్కువ ఉంటాయని అన్నారు. అనారోగ్య సంబంధమైన సమస్యలు ఉంటే వెంటనే వైద్య అధికారులను సంప్రదించాలన్నారు.

March 2, 2026 / 04:59 PM IST

నగరి 7వ వార్డ్‌లో మౌలిక వసతుల కోసం సీపీఐ ధర్నా

CTR: నగరి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు పూర్తయి మౌలిక వసతులు కల్పించలేదని ఆరోపిస్తూ CPI ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ.. 7వ వార్డ్‌లోని 12 వీధులకు సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

March 2, 2026 / 04:58 PM IST

ఇంజనీరింగ్ పనులపై VMRDA సమీక్ష

VSP: VMRDA ఇంజనీరింగ్ విభాగపు పనితీరుపై ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ సోమవారం సమీక్షించారు. పూర్తయిన లేఅవుట్లను ఆక్షన్ ద్వారా విక్రయించి ఆదాయం పెంచాలని సూచించారు. గడువులోగా పనులు పూర్తి చేయాలని హెచ్చరించారు. రహదారుల నిర్మాణంలో అడ్డంకుల తొలగింపు, TDR పంపిణీపై GVMCతో సమన్వయం చేయాలని ఆదేశించారు.

March 2, 2026 / 04:58 PM IST

మరణించిన హోంగార్డు కుటుంబానికి అండగా పోలీస్ శాఖ

అన్నమయ్య: విధి నిర్వహణలో అకాల మరణం చెందిన KV పల్లె పోలీస్ స్టేషన్ హోంగార్డు వేణుగోపాల్ కుటుంబానికి పోలీస్ శాఖ అండగా నిలిచింది. ఆయన సతీమణి చంద్రకళకు కారుణ్య నియామక పత్రాన్ని SP ధీరజ్ సోమవారం మదనపల్లిలో అందజేశారు. బాధిత కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తోడుంటుందని SP భరోసా ఇచ్చారు. సకాలంలో నియామక పత్రం అందజేసినందుకు హోంగార్డు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

March 2, 2026 / 04:53 PM IST

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

SKLM: ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నమని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ మేరకు ప్రజలు పారిశుద్ధ్యం, విద్యుత్,తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని దరఖాస్తు రూపంలో వినతులు అందజేశారు. వినతులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

March 2, 2026 / 04:51 PM IST

పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

ATP: గుత్తి మండల పరిధిలోని జిల్లా సరిహద్దు వద్ద గల జొన్నగిరి గ్రామంలో సోమవారం శ్రీనివాసులు అనే రైతు పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యుల గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

March 2, 2026 / 04:50 PM IST

‘నన్నయ వర్సిటీలో 9న ప్రాంగణ ఎంపికలు’

E.G: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 9న హెటిరో డ్రగ్స్‌, ఎంఆర్‌ఎఫ్‌ టైర్స్‌ సంస్థల ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించనున్నట్లు వీసీ ఆచార్య పి.ప్రసన్నశ్రీ తెలిపారు. పదో తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, బీటెక్‌ చదివిన 18-25 ఏళ్ల పురుష అభ్యర్థులు వీటికి అర్హులన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

March 2, 2026 / 04:50 PM IST

కార్పొరేషన్ పరిధిలో 43 వినతుల స్వీకరణ

NLR: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కార్పొరేషన్లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సోమవారం నిర్వహించారు. విభాగాల వారీగా టిడ్కో హౌసింగ్ 14, టౌన్ ప్లానింగ్ 08, రెవెన్యూ 05, ఇంజనీరింగ్ 04, హెచ్ సెక్షన్ 01, పెన్షన్ 01, ఆప్కాస్ 01, జీఎస్ డబ్ల్యూఎస్ 01, మొత్తం 43 వినతులను కమిషనర్ స్వీకరించారు. అందరికీ న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

March 2, 2026 / 04:47 PM IST

జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు: DEO

KDP: హోలీ పండుగ సెలవు దినం రేపే అని జిల్లా విద్యాశాఖ అధికారి సంషుద్దీన్ స్పష్టం చేశారు. అకడమిక్ క్యాలెండర్లో తెలిపినట్లుగా హోలీ పండుగ సెలవు దినం నాలుగో తేదీ కాదని మార్చి మూడున నిర్ణయించామన్నారు. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారులు గమనించాలని ఆయన కోరారు.

March 2, 2026 / 04:44 PM IST