• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే మార్గదర్శకాలు

KRNL: ఎమ్మిగనూరు ఆర్ & బీ గెస్ట్ హౌస్‌లో గౌరవ ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఇవాళ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, ‘పీఎం సూర్య ఘర్ పథకం’పై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.

March 1, 2026 / 06:30 PM IST

‘నీటి పనులకు నిధులు మంజూరు చేయాలి”

NDL: పాణ్యం మండలం తమ్మరాజుపల్లెలో పైజైన్ పనుల కోసం జిల్లా పరిషత్ నిధుల నుంచి రూ.4 లక్షలు మంజూరు చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కోరారు. ఆమె మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కరిమద్దల గ్రామంలో కొత్త బోరు, పైప్‌లైన్ పనులకు రూ.5 లక్షలు, గని గ్రామంలో వాల్మీకి వీధిలో నీటి సమస్యకు రూ.4 లక్షలు అవసరమన్నారు.

March 1, 2026 / 06:28 PM IST

‘మురికివాడల అభివృద్ధిని విస్మరిస్తే ఆందోళన తప్పదు’

కడప కార్పొరేషన్ కేవలం సంపన్నులకే సేవలు అందిస్తూ, బడుగు బలహీన వర్గాలను విస్మరిస్తోందని చేతివృత్తుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు N.పెంచలయ్య విమర్శించారు. ఆదివారం కడపలో ఆయన మాట్లాడుతూ.. నగరంలోని మురికివాడల్లో కనీసం రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్, కమిషనర్ తక్షణమే స్లమ్ ఏరియాల అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.

March 1, 2026 / 06:25 PM IST

‘రౌడీషీటర్లు నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి’

KRNL: కోడుమూరు నియోజకవర్గంలోని సీ.బెలగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ఎస్సై వేణుగోపాల్ రాజు నేర నియంత్రణలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. నేర ప్రవృత్తిని విడనాడి, చట్టానికి లోబడి సత్ప్రవర్తనతో జీవించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

March 1, 2026 / 06:24 PM IST

సీజేఐ సూర్యకాంత్‌కు ఘన వీడ్కోలు

TPT: తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని ఆదివారం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమైన భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌కు ఘనంగా వీడ్కోలు లభించింది. కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ శ్రీనివాస స్వామి కళ్యాణ చిత్రపటాన్ని జ్ఞాపికగా అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు, న్యాయమూర్తులు, అధికారులు హాజరయ్యారు.

March 1, 2026 / 06:24 PM IST

పేదలకు రంజాన్ ఈద్ కిట్లు

నంద్యాల పట్టణంలో జమీయత్ ఉలేమా హింద్, నంద్యాల జిల్లా ఇమాముల సంఘం ఆధ్వర్యంలో పేద ముస్లిం కుటుంబాలకు 150 రంజాన్ ఈద్ కిట్లను ఆదివారం పంపిణీ చేశారు. కార్యక్రమానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై కిట్లు అందజేశారు. పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు అండగా నిలవడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

March 1, 2026 / 06:22 PM IST

‘అంగన్వాడీ కార్యకర్తలకు బాసటగా కూటమి ప్రభుత్వం’

VZM: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరుఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎల్.కోటలోని టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చరిత్రలోనే రెండుసార్లు అంగన్వాడీ కార్యకర్తలు వేతనాలు పెంచిన ఘనత సీఎం చంద్రబాబునాయుడుకు దక్కుతుందన్నారు.

March 1, 2026 / 06:21 PM IST

‘మెరుగైన వైద్యం అందించడమే కూటమి లక్ష్యం’

NDL: పేదలకు మెరుగైన వైద్యం అందించమే కూటమి లక్ష్యమని ఎమ్మెల్య జయసూర్య అన్నారు. నేడు పాముల పాడు మండలం, బానుముక్కుల గ్రామంలో 40 లక్షలతో నిర్మించబోయే హెల్త్ సెంటర్‌కు MLA భూమి పూజ చేశారు. ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రత్యేక నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

March 1, 2026 / 06:21 PM IST

ఈ నెల 3న పుష్పగిరి ఆలయ వేళల్లో మార్పులు

KDP: వల్లూరు మండలం పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయాన్ని ఈ నెల 3న చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 7.30 వరకు స్వామివారి దర్శనాలు ఉండవని ఈవో శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 7.30 తర్వాత ఆలయ శుద్ధి, విశేష అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు.

March 1, 2026 / 06:19 PM IST

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

సత్యసాయి: లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండూరు క్రాస్ రోడ్ వద్ద సీఐ జనార్ధన్, ఎస్సై సిబ్బందితో కలిసి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం మానుకోవాలని చెప్పారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

March 1, 2026 / 06:19 PM IST

‘అంగన్వాడీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

SKLM: అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ అంగన్వాడీలు చేసిన పలు డిమాండ్లలో తొమ్మిది డిమాండ్లను పరిష్కరించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు.

March 1, 2026 / 06:18 PM IST

సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కేజీ వెండి విరాళం

NDL: శ్రీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి బనగానపల్లె మండలం పలుకూరు గ్రామానికి చెందిన ఉప్పరి సుబ్బరాయుడు కుటుంబ సభ్యులు కేజీ వెండి నాగపడగ(రూ.3.50 లక్షలు)తో పాటు సుమారు రూ.70 వేల విలువైన నిత్యావసర సరుకులు విరాళంగా ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, దాతలకు ఆలయ మర్యాదలతో తీర్థప్రసాదాలు అందజేశారు.

March 1, 2026 / 06:18 PM IST

‘గంజాయి రవాణాకు సహకరిస్తే చర్యలు’

ASR: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారికి సహకరించినా, ఆశ్రయం ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం మంప ఎస్సై శ్రీనివాస్, ఏపీఎస్పీ సిబ్బందితో గరిమండ గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులు గ్రామాల్లోకి ప్రవేశిస్తే సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

March 1, 2026 / 06:16 PM IST

90 లక్షలతో సెంట్రల్ లైటింగ్

NLR: అల్లూరు మండల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. అల్లూరు మండలంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో ONGC కంపెనీ సీఎస్ఆర్ నిధులు 90 లక్షలతో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ లైటింగ్‌కు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ రవిచంద్ర పాల్గొన్నారు.

March 1, 2026 / 06:15 PM IST

హెల్మెట్‌పై ద్విచక్ర వాహనదారులకు అవగాహన

కృష్ణా: మచిలీపట్నం-పెడన జాతీయ రహదారి 216పై ట్రాఫిక్ సీఐ నున్న రాజు హెల్మెట్ ధరించడంపై ద్విచక్ర వాహనదారులకు ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ హెల్మెట్ ధరించని వాహనదారులకు కేవలం ఫైన్ వెయ్యడమే కాకుండా, వారితో అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా జరిపించాలని సూచించారు.

March 1, 2026 / 06:15 PM IST