• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జమ్మలమడుగు దేవర.. జిల్లా ఎస్పీకి ఆహ్వానం

KDP: జమ్మలమడుగు పెద్దమ్మ తల్లి దేవరకు ఎస్పీ నచికేత్‌కు ఆహ్వానం అందింది. మార్చి 1వ తేదీన జమ్మలమడుగులో జరిగే దేవర మహోత్సవానికి రావాలని దేవర కమిటీ సభ్యులు ఎస్పీ కార్యాలయంలో ఆయనను కలిసి ఆహ్వానించారు. దాదాపు 17 సంవత్సరాల తర్వాత జరుగుతున్న పెద్దమ్మ తల్లి దేవర వేడుకలు ప్రశాంత వాతావరణంలో వైభవంగా సాగుతున్నాయని కమిటీ సభ్యులు SPకు తెలియజేశారు.

February 28, 2026 / 10:20 AM IST

రేపు గుమ్మళ్ళదిబ్బలో పర్యటించనున్న ఎమ్మెల్యే

NLR: కోవూరు పంచాయతీ గుమ్మళ్ళదిబ్బలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదివారం పర్యటించనున్నట్లు టీడీపీ మండలాధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పాటూరులో ఏర్పాటు చేసిన చేనేత క్లస్టర్ ద్వారా చేనేత కార్మికులకు సాయంత్రం 4గంటలకు చేనేత ఉపకరణాలు పంపిణీ చేస్తారని వివరించారు.

February 28, 2026 / 10:20 AM IST

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ

CTR: పలమనేరు-చిత్తూరు రోడ్డులోని ఓ పాఠశాల వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్తంభాన్ని శుక్రవారం రాత్రి లారీ ఢీకొట్టడంతో విరిగిపోయింది. కేవలం వైర్ల ఆధారంగా పోల్ నిలబడి ఉంది. ఎప్పుడు నేల కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. పరిస్థితి గమనించిన స్థానికులు ఎవరూ దగ్గరకు వెళ్లకుండా రాళ్లు పెట్టి, విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించారు.

February 28, 2026 / 10:11 AM IST

పెద్దకడబూర్‌లో పర్యటించిన MRPS రాష్ట్ర అధ్యక్షుడు

KRNL: పెద్దకడబూర్ మండలంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ శనివారం పర్యటించారు. దళిత గిరిజనుల సమస్యలను తెలుసుకుని, మాదిగలపై హత్యలు, దాడులు ఆపాలని అయన కోరారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వినతి పత్రాల కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు, యువత పాల్గొన్నారు.

February 28, 2026 / 10:10 AM IST

కలెక్టరుకు చాక్‌పీస్ మైక్రోఆర్ట్ బహూకరణ

W.G: పెరవలి మండలం తీపర్రుకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ కోడూరి రాఘవేంద్ర బాబు తన ప్రతిభతో కలెక్టరును ఆకట్టుకున్నారు. చాక్‌పీస్ పై కలెక్టర్ చదలవాడ నాగరాణి పేరును అద్భుతంగా చెక్కి, శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో ఆమెకు అందజేశారు. ఈ కళాఖండాన్ని చూసి విస్మయం చెందిన కలెక్టర్.. రాఘవేంద్ర బాబును ప్రత్యేకంగా అభినందించారు.

February 28, 2026 / 10:10 AM IST

గూడూరులో పెన్షన్ల పంపిణీ

TPT: గూడూరు మునిసిపాలిటీలో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ మొదలైంది. నెల్లటూరు సచివాలయ ఉద్యోగిని వాత్సల్య ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేశారు. ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేశామని చెప్పారు. ఇవాళ పింఛన్ తీసుకోని వారికి సోమవారం ఇవ్వనున్నారు.

February 28, 2026 / 10:10 AM IST

నరసరావుపేటలో పోలీసుల కార్డెన్ సెర్చ్

PLD: నరసరావుపేట క్రిస్టియన్‌పాలెంలో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పోలీసులు శనివారం తెల్లవారుజామున ఆకస్మిక కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేసిన పోలీసులు.. రౌడీషీటర్లు, పాత నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 31 బైకులు, 2 ఆటోలతో పాటు కత్తులు, గొడ్డళ్లు వంటి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

February 28, 2026 / 10:05 AM IST

గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమం

CTR: జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ దూడి ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ శ్రీ రాజశేఖర్ పర్యవేక్షణలో జిల్లాలోని గ్రామాలలో “పల్లె నిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు గ్రామస్తులతో సంభాషించి ధైర్యం-స్పర్శ, మహిళలు మరియు పిల్లలపై నేరాలు, సైబర్ నేరాల జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం, బాల్య వివాహాల నివారణపై మార్గ నిర్దేశం చేశారు.

February 28, 2026 / 10:02 AM IST

ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్

ప్రకాశం: అర్ధవీడు మండలంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లతోపాటు,గతంలో ఈసీగా విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం మార్కాపురం కార్యాలయంలో ఈసీగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి సస్పెండ్ అయ్యారు. అర్ధవీడులో మొక్కలు లేకుండానే బిల్లులు చేశారని లోకాయుక్తకు ఫిర్యాదు మేరకు, విచారణ చేపట్టిన అధికారులు భారీ అవినీతి బయటపడడంతో వారిని సస్పెండ్ చేశారు

February 28, 2026 / 10:01 AM IST

తాగునీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని తాగునీటి శుద్ధి కేంద్రాన్ని కమిషనర్ లక్ష్మీదేవి శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఆమె తాగునీటి శుద్ధి కేంద్రంలోని యంత్రాల పనితీరు, నీటి నాణ్యత, పారిశుధ్య పరిస్థితులను తనిఖీ చేసి ప్రజలకు నిరంతరం సురక్షితమైన తాగునీరు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. తాగునీటి శుద్ధి ప్రక్రియ సక్రమంగా జరుగుతోందో లేదో చూడాలన్నారు.

February 28, 2026 / 10:00 AM IST

ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవం

ASR: కొయ్యూరు మండలం చల్దిగెడ్డకు చెందిన నాగులమ్మ అనే నిండు గర్భిణికి శనివారం పురుటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో 108 వాహనం రహదారి సౌకర్యం లేక గ్రామ సమీపానికి చేరుకుంది. కుటుంబీకులు గర్భిణీని మోసుకొని వచ్చి, అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఈఎంటీ ఈశ్వరరావు, పైలెట్ హరి ప్రసాద్ ప్రసవం చేశారు

February 28, 2026 / 10:00 AM IST

జిల్లాలో 58.70 పింఛన్ల పంపిణీ పూర్తి: DRDA

అనకాపల్లి జిల్లాలో ఉదయం 8.52 గంటల వరకు 58.70 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయినట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి తెలిపారు. 76.38 శాతంతో నర్సీపట్నం మండలం ముందంజలో ఉందన్నారు. 47.8 శాతంతో పాయకరావుపేట మండలం చివర స్థానంలో ఉందన్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభించిన పింఛన్లు సాయంత్రంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

February 28, 2026 / 10:00 AM IST

సైనిక్ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

VZM: ALL INDIA SAINIK EXAMలో ఎస్.కోట మండలం దొగ్గపేట ఎంపీపీ పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు HM బీ సురేష్ శనివారం తెలిపారు. వజ్రపు శశి కుమార్ 267/300, చుక్కా శశాంక్ 241/300, తొత్తడి రిషిత 227/300 మార్కులు సాధించినట్లు తెలిపారు. వీరి ప్రతిభకు కారణమైన ఉపాధ్యాయులను విద్యార్థులు తల్లిదండ్రులు, స్థానికులు అభినందించారు.

February 28, 2026 / 10:00 AM IST

మగ బిడ్డను చెత్త దిబ్బలో పడేసిన కసాయి తల్లి

సత్యసాయి :సోమందేపల్లి మండలం నడింపల్లి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.అప్పుడే పుట్టిన మగ బిడ్డను ఓ తల్లి చెత్త దిబ్బలో పడేసిన ఘటన కలకలం రేపింది.శిశువు ఏడుపు వినిపించడంతో అప్రమత్తమైన గ్రామస్తులు అక్కడికి చేరుకుని,చెత్త దిబ్బలో పడి ఉన్న బాబును గుర్తించి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 28, 2026 / 10:00 AM IST

నిద్రమత్తులో ప్రమాదం.. వ్యక్తి మృతి

E.G: దేవరపల్లి మండలం ఎర్నగూడెం జాతీయ రహదారిపై  శనివారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పాతబగ్గానికి చెందిన కొందరు గుడివాడ మినప చేలు తీత కోసం వెళుతుండగా లారీ పైనుంచి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కిందపడే సమయంలో సదరు వ్యక్తి నిద్ర మత్తులో ఉన్నట్లు సమాచారం.

February 28, 2026 / 10:00 AM IST