VZM: వేసవి నేపథ్యంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల పట్ల ప్రతీఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చీపురుపల్లి ప్రాంతీయ హాస్పిటల్ సివిల్ సర్జన్ డాక్టర్ కృష్ణారావు సోమవారం తెలిపారు. మార్చి ప్రారంభానికి ఎండలు పెరిగిపోతున్నాయని, ఏప్రిల్, మే, జూన్లో ఇంకా ఎక్కువ ఉంటాయని అన్నారు. అనారోగ్య సంబంధమైన సమస్యలు ఉంటే వెంటనే వైద్య అధికారులను సంప్రదించాలన్నారు.