ఏపీ వైఎస్సార్ జిల్లా ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి (Sivaprasad Reddy) తన పెద్ద కూతురు పల్లవికి దగ్గరుండి ప్రేమ వివాహం జరిపించారు.చదుకునే రోజుల్లో ఆమె పవన్ అనే యువకుడిని లవ్ చేసింది. డబ్బు, హోదా, కులానికి విలువ ఇవ్వకుండా పెళ్లి చేయించారు. బొల్లవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలో పెళ్లి(wedding)చేశారు. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ (Registration) చేయించారు. తన కూతురుకు ఇష్టమైన యువకుడితో పెళ్లి చేశానని రాచమల్లు చెప్పారు. వారిద్దరు కలిసి చదువుకున్న రోజుల్లో ఇష్టపడ్డారని తెలిపారు. డబ్బు, హోదా, కులం వంటి వాటికి విలువ ఇవ్వకుండా వారిద్దరు ఇష్టపడటంతో, వారి అంగీకారం ప్రకారం పెళ్లి (wedding) చేసినట్లు తెలిపారు.
కులాల కంటే గుణమే గొప్పది. పెళ్లి కొడుకు తండ్రి ఆర్టీసీలో చిన్న మెకానిక్ (Mechanic).. అయితే నేను డబ్బుకు ఎలాంటి ప్రాధాన్యత వ్యక్తిని కాదు. డబ్బుకు ఎలాంటి వ్యక్తిని కాదని.. అందుకే నా కూతురుకు నచ్చిన వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేశానని ఎమ్మెల్యే అన్నారు. సామాజిక స్థాయి గురించి ప్రస్తావించినప్పుడు.. పెళ్లి చేసుకున్న ఇద్దరు సంతోషంగా ఉండటమే ముఖ్యమని చెప్పానని. స్థాయిని, డబ్బును, కులానికి ప్రాధాన్యత ఇవ్వకుండా నా కూతురు ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి చేశాన్నారు. చాలా గొప్పగా పెళ్లి చేద్దామంటే ఒప్పుకోకపోవడంతో.. ఆమె కోరుకున్న విధంగానే సింపుల్(Simple)గా పెళ్లి చేయడం జరిగింది. ఆడపిల్లలకు అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వారి నిర్ణయాలు బాగోలేకపోతే.. సూచనలు చేయడమే మన బాధ్యత. నా బిడ్డ కులాంతర వివాహాన్ని సంతోషంగా చేశాను. అబ్బాయి ఎంబీఏ చేశాడు. హైదరాబాద్(Hyderabad)లోని కంపెనీలో రూ. 80 వేల జీతానికి పనిచేస్తున్నాడు. చదువు, ఉద్యోగంకు ప్రాధాన్యత ఇచ్చే ఈ వివాహాన్ని జరిపించాను. నా కూతురు వివాహాన్ని అంగీకరిస్తారని.. ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.