టమాటా ధరలు (Tomato prices) భారీగా పడిపోయాయి.మొన్నటి వరుకు చుక్కలను చూపించిన టమాట ఇప్పుడు పాతాళానికి పూర్తిగా పడిపోయింది.కిలో టామటా రేటు రూ.200 నుంచి రూ.8కు పడిపోయింది. దీంతో టమాట రైతులు కన్నీరు పెడుతున్నారు. అన్నదాత (Breadwinner )ఆరుగాలం కష్టపడి పండిస్తే పండిస్తే పొలం నుంచి మార్కెట్కు కిరాయి ఖర్చులకు కూడా గిట్టుబాటు కావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ లోని కర్నూలు జిల్లా పత్తికొండ (Pattikonda) మార్కెట్లో టామాటాల రేటు క్వింటాలుకు రూ.100 నుంచి రూ.200 మధ్యలో పలుకుతోంది. ఈ ధరకు అమ్ముకోలేక, పంటను నిల్వ చేసుకోలేక అన్నదాత విలవిలలాడుతున్నారు.
రిటైల్ మార్కెట్లలో మాత్రం కిలో టమాటాల ధర రూ.20 నుంచి రూ.30 పలుకుతోందని రైతులు (Farmers) చెబుతున్నారు. హోల్ సేల్ మార్కెట్లలో గిట్టుబాటు ధర (Affordable price) పలకడంలేదన్నారు. ఎరువులు, సాగు, కూలీ ఖర్చుల సంగతి పక్కన పెడితే పండించిన పంట మొత్తం అమ్మినా రవాణా ఖర్చులు (Transportation costs) కూడా రావట్లేదని వాపోతున్నారు. దీంతో సాగు ఖర్చులకు అదనంగా ఈ రవాణా ఖర్చుల భారానికి భయపడి కొంతమంది రైతులు టమాటాలను రోడ్లపైన పారబోస్తున్నారు. ఇంకొంతమంది రైతులు పంటను పొలాల్లో అలాగే వదిలేస్తున్నారు. కాగా, పెద్ద మొత్తంలో టమాటా నిల్వలు మార్కెట్లకు చేరడంతో ధరలు పడిపోయాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రెండు నెలల క్రితం టమాట ధరలు సంచలనం సృష్టించాయి.
చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఆకాశాన్ని అంటాయి. కిలో టమాట రూ.300 వరకు పలికింది. కొందరు రైతులైతే కోట్లలో ఆర్జించారు. అయితే సాధారణ మధ్యతరగతి పౌరుడు మాత్రం ఇబ్బంది పడ్డాడు. వంద రూపాయలు పెట్టినా ఐదు టమాటలకు మించి రాకపోవడంతో ఆందోళన చెందాడు. దాంతో పాటే పచ్చి మిర్చీ ఇతర కూరగాయలు (Vegetables)పెరగడంతో జేబుకు చిల్లు పడింది. ఇంటి బడ్జెట్ పెరిగి పోయింది.వేసవిలో విపరీతంగా ఎండలు కొట్టడంతో టమాట దిగుబడి (Tomato Production) తగ్గిపోయింది. అదే సమయంలో కొన్ని చోట్ల అతి వృష్టితో టమాట పంట నాశనమైంది.