బెంగళూరు (Bangalore) నగరంలో లివింగ్ కాస్ట్ చాల ఎక్కువ అందరికి తెలిసిందే. రూమ్ రెంట్స్ విపరీతంగా ఉంటాయి. భారీ మొత్తంలో అడ్వాన్స్, నెలనెలా పెద్ద మొత్తంలో అద్దె చెల్లించాల్సి వస్తోంది.ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్(Software Engineer)గా పనిచేస్తున్నా పృథ్వీరెడ్డి ఇటీవలే బెంగళూరు నుంచి హైదరాబాద్(Hyderabad)కు షిఫ్ట్ అయ్యాడు.సదరు కంపెనీలో రిమోట్ వర్కింగ్ ఆప్షన్ ఎంచుకుని తాను హైదరాబాద్ కు వచ్చేశానని ఆయన తెలిపాడు.ఇక్కడికి వచ్చాక తన డైలీ ఖర్చులు (Daily Expenses) చాలా తగ్గిపోయాని ఇది నమ్మశక్యం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం మంత్కు రూ.40 వేల దాకా పొదుపు చేస్తున్నానని ట్వీట్ చేశాడు.
ఈ మొత్తంతో ఓ సాధారణ కుటుంబం నెల మొత్తం హ్యాపీగా జీవిస్తుందని తెలిపాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ (tweet viral) గా మారింది. ఈ ట్వీట్ పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది పృథ్వీరెడ్డి (Prithvi Reddy) మాటలతో ఏకీభవించగా.. మరికొందరు మాత్రం నిజమేనా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇదెలా సాధ్యమని ట్విట్టర్ లో ప్రశ్నించిన ఓ యూజర్ కు పృథ్వీ రెడ్డి జవాబిస్తూ.. బెంగళూరులో ఇంటద్దె, మెయింటనెన్స్, వాటర్, విద్యుత్ బిల్లులు (Electricity bills), తిండి.. అంటూ ఖర్చుల వివరాలు చెప్పాడు. కాగా, బెంగళూరులోనే కాదు ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా కాస్టాఫ్ లివింగ్ (Castoff living) విపరీతంగా పెరిగిపోయిందని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. ఏ సిటీలో అయినా సరే.. ప్రాంతాన్ని బట్టి ఇంటద్దె (house price), ఇతర ఖర్చుల లెక్కలు మారుతుంటాయని, అన్నీ కలుపుకుంటే రెండు నగరాల్లోనూ ఖర్చులు దాదాపుగా ఒకేలా ఉంటాయని అంటున్నారు.