MBNR: మూడో విడత సర్పంచ్ ఎన్నికలు ఈ నెల 17న జరగనున్నాయి. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు 144 సెక్షన్ గ్రామాలలో అమలు ఉంటుందని ఎస్పీ జానకి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని అడ్డాకుల, బాలానగర్, మూసాపేట్, జడ్చర్ల, భూత్పూర్, నవాబ్ పెట్ మండలంలోని 12 గ్రామాల ఎన్నికలు ఉంటాయన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి సహకరించాలని కోరారు.