KNR: మానేరు జలాశయంలో డిసెంబర్ 20న నిర్వహించనున్న అయ్యప్ప తెప్పోత్సవానికి సర్వం సిద్ధమైంది. తెప్పోత్సవ కమిటీ ఛైర్మన్ సంపత్ ఆధ్వర్యంలో భగత్‌నగర్ అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో పోస్టర్లను విడుదల చేశారు. గత 15 ఏళ్లుగా ఈ ఉత్సవాన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు.