GNTR: సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. సంస్థాగత బలోపేతం లక్ష్యంగా, ఆయన త్రిసభ్య కమిటీలతో సమావేశం కానున్నారు. జిల్లాల కమిటీల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోవడమే ఈ భేటీ ముఖ్య ఉద్దేశం. జిల్లాల కమిటీల కసరత్తు పూర్తయింది. త్వరలో రాష్ట్ర కమిటీ కూడా ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.