KPHBలో అడ్డగుట్టలో చోటుచేసుకున్న విషాదం
నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి
ఆరవ అంతస్తులో సెంట్రింగ్ కర్రలు విరిగి పడటంతో చోటుచేసుకున్న ఘటన
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు
ఆ భవనం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో కేవలం గ్రీన్ మ్యాట్ మాత్రమే రోడ్డుకు అడ్డుగా ఏర్పాటు చేశారు
పెద్ద భవనం కట్టే క్రమంలో కనీసం పక్కన గోడ కూడా ఏర్పాటు చేయకుండానే బిల్డింగ్ నిర్మిస్తున్నారు
తాజా ఘటనతో రోడ్డుపై పెద్ద ఎత్తున పడిన మట్టి పెళ్లలు
ఏపీలోని కాకినాడ జిల్లా రాజపూడిలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ముగ్గురు వ్యక్తులు మృత్యువాత చెందారు. పామాయిల్ తోటలో అనుకోకుండా విద్యుత్ తీగలు తగలడంతో వారు మరణించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను ఆరా తీశారు. మృతులు బోదిరెడ్డి సూరిబాబు, కిల్లినాడు, గల్ల బాబీగా గుర్తించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.