ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత సోమవారం రాత్రి అనంతపురంలోని శాంతి థియేటర్లో కుటుంబ సభ్యులతో కలిసి ‘అఖండ-2’ సినిమా చూశారు. అభిమానుల అంచనాలకు మించి దర్శకుడు బోయపాటి ఈ సినిమాను తెరకెక్కించారని ఆమె తెలిపారు. నందమూరి బాలకృష్ణ నట ఉగ్రరూపాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను సినిమాలో అద్భుతంగా చూపించారని సునీత ప్రశంసించారు.