GNTR: చెట్టుకొమ్మల తొలగింపు, విద్యుత్ వ్యవస్థ మరమ్మతుల నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నగరంలోని తారకరామనగర్, జయంతి నగర్, హనుమాన్ నగర్, బ్రాడీపేట, అశోక్ నగర్, లక్ష్మీపురం మెయిన రోడ్డు తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని , విద్యుత్ అధికారి గురవయ్య ఒక ప్రకటనలో తెలిపారు. కావున వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.