»Notification For 2000 Sbi Po Job Application From September 7th 2023
SBI PO Notification: 2 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్..నేటి నుంచే అప్లికేషన్స్
బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు మంచి అవకాశం వచ్చింది. ప్రముఖ బ్యాంక్ అయిన ఎస్బీఐ(SBI) నుంచి 2000 వేల పీవో(PO) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మీరు అర్హులైతే ఇంకెందుకు ఆలస్యం వెంటనే అప్లై చేయండి.
Notification for 2000 sbi po job Application from september 7th 2023
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నుంచి 2వేల పీఓ(PO) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజైంది. ఈ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 7న ప్రారంభమై సెప్టెంబర్ 27, 2023న ముగుస్తుంది. ఈ పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష నవంబర్ 2023లో నిర్వహించబడుతుంది. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏదైనా సమానమైన విద్యార్హత కల్గి ఉండాలి. గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం/సెమిస్టర్లో ఉన్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే వారు డిసెంబర్ 31, 2023న లేదా అంతకు ముందు గ్రాడ్యుయేషన్ పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు రుజువును సమర్పించాల్సిన షరతులకు లోబడి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు పరిమితి ఏప్రిల్ 1, 2023 నాటికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము జనరల్/ EWS/ OBC అభ్యర్థులకు రూ.750. SC/ ST/ PwBD అభ్యర్థులు ఎలాంటి రుసం చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అప్లికేషన్ ఫీజు ఒకసారి చెల్లించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరిగి చెల్లించబడదు. కాబట్టి ఈ పోస్టులకు అప్లై చేసే ముందే డిసైండ్ అయ్యి దరఖాస్తు చేయండి. ఎంపిక ప్రక్రియ విధానంలో మొదట ప్రిలిమినరీ పరీక్ష తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తారు. వీటిలో సెలక్ట్ అయిన వారిని ఫైనల్ గా ఎంపిక చేస్తారు.