»Another 5th Leopard Trapped In Tirumala September 7th 2023 Fifth Leopard
Tirumala:లో చిక్కిన ఐదో చిరుత..నిజమేనా?
తిరుమల(Tirumala) తిరుపతి అలిపిరి మార్గంలో ఇటివల కనిపించిన చిరుత(leopard) ఎట్టకేలకు అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకుంది. దీంతో గత రెండు నెలల్లో ఇప్పటివరకు ఐదు చిరుతలు చిక్కినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ పలువురు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలోని తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే అలిపిరి(alipiri) కాలిబాట మార్గంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత(leopard) చిక్కుకుంది. ఈ చిరుతతో చిక్కడంతో గత రెండు నెలల సమయంలో మొత్తం ఐదు చిరుతలను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే నాలుగు రోజుల క్రితమే ఈ చిరుత అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాల్లో చిక్కిందని అధికారులు చెబుతున్నారు. అప్పటి నుంచి అధికారులు దీనిని బంధించేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ చిరుత నిజంగా పట్టుబడిందా లేక జూ నుంచి తీసుకొచ్చి ఇలా చేస్తున్నారా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి ఎవరికీ తెలియని సమయంలో మాత్రమే చిరుతలు చిక్కుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే ఆ ప్రాంతంలో దారి పొడవునా సీసీటీవీ కెమెరాల ఫుటేజీలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ చిరుతపులుల రాక, వాటి తీరును పరిశీలిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇటివల ఏర్పాటు చేసిన బోనులోకి ఆ చిరుత ప్రవేశించి చిక్కుకుపోయింది. అనంతరం అటవీశాఖ అధికారులు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర జూలాజికల్ పార్కుకు తరలించారు. ఆగస్టు 11న ఆరేళ్ల బాలిక లక్షిత(6)పై చిరుత దాడి చేసి చంపిన తర్వాత పట్టుబడిన నాలుగో చిరుత ఇది కావడం విశేషం. ఈ ఘటనతో కొండపై ఆలయ వ్యవహారాలను చూసే టీటీడీ(TTD), అటవీశాఖ అధికారులు నిఘా పెంచారు. ఆలయానికి వెళ్లే భక్తుల రాకపోకలపై కొన్ని ఆంక్షలు విధించారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. శ్రీవారి ఆలయంలో నిర్వహించిన ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయని టీటీడీ ఛైర్మన్ భూమణ కరుణాకర్ రెడ్డి తెలిపారు.