గురువుల (Teachers) కంటే గూగుల్ (Google) మేలు అని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ (Minister Adimulapu suresh) అన్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే తాను ఆ మాటలు అనలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..కొందరు తాను అనని మాటలను అన్నట్లుగా చెబుతున్నారన్నారు. గురువుల కంటే గూగుల్ మేలు అని తాను అనలేదన్నారు.
తనపై వస్తున్న దుష్ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మొదని, అటువంటి మాటలను తాను ఖండిస్తున్నట్లుగా మంత్రి ఆదిమూలపు సురేశ్ (Minister Adimulapu suresh) అన్నారు. మారుతన్న కాలంతో పాటుగా టెక్నాలజీ (Technology)ని అందిపుచ్చుకుని గూగుల్ (Google)పై ఆధారపడుతూ గురువులను మరిచిపోతున్నారని, తన ఉద్దేశం అదేనని, ఆ విషయం గురించి తాను మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు.
ప్రతి విద్యార్థి తల్లిదండ్రులపై (Parents), గురువుల (Teachers)పై గౌరవం కలిగి ఉండాలన్నారు. గురువులపై గౌరవం కలిగిన వ్యక్తినని, అలాంటిది గురువులనే అంతటి మాట అంటానా అని అన్నారు. తానెప్పుడూ గురువులను కించపరుస్తూ అలాంటి వ్యాఖ్యలు చేయనన్నారు. తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారి ఆటలు సాగవన్నారు.