»Ap Police Notice To Nara Lokesh Clarity That He Will Not Take It Notice At Bhimavaram
Nara Lokesh:కు పోలీసుల నోటీస్..తీసుకోనని క్లారిటీ
ఏపీలోని భీమవరం(bhimavaram)లో యువగళం పాదయాత్ర సందర్భంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh)కు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ వాటిని తీసుకునేందుకు లోకేష్ నిరాకరించారు.
ap Police notice to Nara Lokesh clarity that he will not take it notice at bhimavaram
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం(bhimavaram)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్ర సందర్భంగా క్యాంప్ సెట్ పై పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో పోలీసులు 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. పాదయాత్ర క్రమంలోనే నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యేపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆయనకు పోలీసులు(police) నోటీసులు అందించారు. కానీ లోకేష్ దానిని తీసుకునేందుకు నిరాకరించారు. గతంలో కూడా జగన్ మోహన్ రెడ్డి కూడా అనేక వ్యాఖ్యలు చేశారని ఆయన గుర్తు చేశారు. వాటిలో ఒక్కటి కూడా నిరూపించలేదని అన్నారు. తాము శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే ఎవరు మొదట వచ్చి గొడవలు చేశారో.. తమ వద్ద వీడియోలు ఉన్నాయని లోకేష్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో దాడులను ప్రోత్సహించేలేదని..అయినా కూడా తాను తప్పుచేయకుండా నోటీసులు తీసుకునేది లేదని వెల్లడించారు. దీంతోపాటు తనపై వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని లోకేష్ పోలీసులను ప్రశ్నించారు.