తాము అధికారంలోకి వస్తే… వాలంటీర్లపై ముందు తుపాకీ పేలుస్తాం అంటూ…. ఇటీవల చంద్రబాబు చేసిన కామెంట్స్ కి… మంత్రి ధర్మాన ప్రసాదరావు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తుపాకీ పేల్చడానికన్నా ముందే.. మనమే పేలుద్దామంటూ ఆయన వాలంటీర్లకు పిలుపునిచ్చారు.
ధర్మాన ప్రసాదరావు… వాలంటీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమ ప్రభుత్వం అబివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మూడున్నరేళ్లలో ఎన్నడూ జరగని రీతిలో… అభివృద్ధి చేపట్టామని ఆయన అన్నారు.
ప్రజలకు డబ్బు ఇస్తే దుబారా అంటున్నారని…. ఏ ఆసరా లేని స్త్రీకి డబ్బులు ఇవ్వడం దుబారా అంటే ఎలా? అని ప్రశ్నించారు. అమ్మఒడి కింద డబ్బులు వేసి, నీ పిల్లాడిని స్కూల్కు పంపు, బడికి పంపు అని చెప్పడం దుబారా అంటే ఎలా అని అన్నారు. కరోనా కలంలో అన్ని వర్గాలను ఆదుకున్నామని చెప్పారు. ప్రజా స్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని చెప్పారు. నోటికేదొస్తే అది మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళని అన్నారు.
ఓ మంచి ప్రభుత్వం కోసం ప్రచారం చేసే అవకాశం వాలంటీర్లకు వచ్చిందని పేర్కొన్నారు. ఓటర్లను మంచి డైరెక్షన్ లో తీసుకు వెళ్లాలని సూచించారు. చంద్రబాబు వస్తే ముందు తుపాకీ పేలేది వాలంటీర్లపైనేనని అన్నారు. ఆయన పేల్చే వరకు ఎందుకు మనమే పేల్చేద్దామంటూ వ్యాఖ్యనించారు. వచ్చేఏడాది మే నెలకల్లా 17 కి పూర్తి స్థాయిలో వంశధర నీరు అందిస్తామన్నారు. అదికారం కోసం టీడీపీ వాళ్ళు ఎన్నో జిమ్మిక్కులు వేస్తున్నారు వారి మాయలో పడిపోకూడదన్నారు. తగాదాలు లేకుండా ఉండేలా భూ సర్వేలు సాఫీగా జరుగుతున్నాయని ఈ సందర్బంగా ధర్మాన పేర్కొన్నారు.