Magunta srinivasulu reddy:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) కవితను అనుసరిస్తున్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన కూడా హాజరుకాలేదు. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) చెన్నైలో ఉన్నట్టు తెలుస్తోంది.
Magunta srinivasulu reddy also not attend ed enquiry
Magunta srinivasulu reddy:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) కవితను అనుసరిస్తున్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీలో విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన కూడా హాజరుకాలేదు. ప్రస్తుతం మాగుంట శ్రీనివాసుల రెడ్డి (Magunta srinivasulu reddy) చెన్నైలో ఉన్నట్టు తెలుస్తోంది. విచారణకు ఎందుకు హాజరకాలే అనే అంశంపై స్పష్టత లేదు. ఆయన ప్రతినిధులు కూడా ఈడీ కార్యాలయానికి రాలేరు. 16వ తేదీన కవిత తన లాయర్‌ను పంపించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 11 గంటలకు మాగుంట విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ఆయన గైర్హాజరు అయ్యారు.
లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూపులో (south group) కీ రోల్ పోషించిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి (magunta srinivasulu reddy) ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి (raghava reddy) అరెస్టై.. ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10వ తేదీన రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
లిక్కర్ స్కామ్‌లో ఇప్పటివరకు 11 మంది (11 members) అరెస్ట్ అయ్యారు. ఇండో స్పిరిట్స్ సంస్థ యజమాని సమీర్ మహేంద్ర (sameer mahendra) సెప్టెంబర్ 28వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. అరబిందో గ్రూప్ – ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ పీ శరత్ చంద్రా రెడ్డిని (sharath chandra reddy) నవంబర్ 11వ తేదీన, పెర్నార్డ్ రిచర్డ్ కంపెనీకి చెందిన బినొయ్ బాబును నవంబర్ 11న.. అభిషేక్ బోయినపల్లి (abhishek) నవంబర్ 13వ తేదీన అరెస్ట్ చేశారు. విజయ్ నాయర్ నవంబర్ 13వ తేదీన.. బడ్డీ రిటెయిల్ సంస్థ డైరెక్టర్ అమిత్ అరోరాను (amith arora) నవంబర్ 29వ తేదీన.. ఫిబ్రవరి 8న గౌతమ్ మల్హోత్రా (gautham malhotra).. చారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రాజేష్ జోషి (rajesh joshi)ను ఫిబ్రవరి 9వ తేదీన.. ఫిబ్రవరి 11వ తేదీన మాగుంట రాఘవ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు కవిత.. ఆ తర్వాత మాగుంట శ్రీనివాసుల రెడ్డికి నోటీసులు జారీచేశారు.