వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఏపీకీ ప్రత్యేక హొదా వస్తుందని ఏపీ పీసీసీ ఛీప్ గిడుగు రుద్రరాజు తెలిపారు. రాహుల్ ప్రధాని అయిన వెంటనే ఆయన పెట్టే తొలి సంతకం ఏపీ ప్రత్యేక హోదా పైలు మీదేనని ఆయన అన్నారు. విజయనగరం జిల్లాలో చేయి చేయి కలుపుదాం..రాహుల్ గాంధీని బలుపరుద్దాం కార్యక్రమాన్ని ప్రారింభించారు. అనంతరం ఆయన పలు ప్రాంతల్లో పర్యటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానలను అవలంబిస్తున్నాయని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంటింటా కాంగ్రెస్ కరపత్రం కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ కలిసి తమను కాపాడాలని వినతిపత్రం ఇవ్వడం బాధాకరమన్నారు. జగన్ ప్రభుత్వ రాక్షస పాలనకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలన్నారు. తాము అధికారంలోకి వస్తే విశాఖ పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని రుద్రరాజు పేర్కొన్నారు.