WG: పెంటపాడు మండలంలో 2024 జూలై ఖరీఫ్ సీజన్లో కురిసిన అధిక వర్షాలకు 1087 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. దాదాపు 2,297 మంది రైతులు నష్టపోయారు. 1,792 మంది రైతులకు రూ.1,45,62,880లను ప్రభుత్వం వారి ఖాతాలకు జమ చేసింది. మరో 505 మంది రైతులకు రూ. 39,07,413లు జమ కావాల్సి ఉంది. ఇన్పుట్ సబ్సిడీ నిధులు జమ చేసి, ఆదుకోవాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.