VSP: పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతి కార్యకర్తకు వైసీపీలో గుర్తింపు ఉంటుందని దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఆన్లైన్ క్యాడర్ రిజిస్ట్రేషన్ దక్షిణ నియోజకవర్గంలో వేగంగా జరుగుతోందన్నారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.