KKD: జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ప్రధాన రహదారులు, కూడళ్లు, లాడ్జీలు, ఇతర రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పెద్దాపురం కాకినాడ డీఎస్పీలు శ్రీహరిరాజు, దేవరాజ్ మనీష్ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.