PPM: సీతానగరం మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ముడుపుల పూజ ఘనంగా నిర్వహించారు. ఉగాది సందర్భంగా తెల్లవారుజాము 3 గంటల నుంచి భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. స్వామి వారిని విశ్వాసంతో నమ్మకంతో 27 సార్లు ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోర్కెలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు శ్రీనివాసచార్యులు తెలిపారు.