SKLM: కోటబొమ్మాళి మండలం పట్టుపురంలో శనివారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరికి త్వరలో పింఛన్లు అందజేస్తామని తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు.