కర్నూలు నగరపాలక సంస్థలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదివారం తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని సమావేశ భవనంలో కార్యక్రమం జరుగుతుంది. ప్రజలు తమ అర్జీలను సమర్పించి సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. అర్జీ స్థితిని https://Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.