నంద్యాల జిల్లా బయోలాజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో నేషనల్ సైన్స్ డే వారోత్సవాల సందర్భంగా “ఉమెన్ ఇన్ సైన్స్” థీమ్‌తో సెమినార్ నిర్వహించారు. ఉప విద్యాశాఖ అధికారి శంకర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బయాలజీ విభాగంలో విశిష్ట సేవలందించిన, విద్యార్థులను రాష్ట్ర–జాతీయ సైన్స్ ఫెయిర్లకు ప్రోత్సహించిన ఉపాధ్యాయులను సన్మానించారు.