ELR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మహిళా వారోత్సవాలు బుధవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కళ్యాణ మండపంలో భారీ రక్తదాన శిబిరం, మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.మార్చి1 నుండి 8 వరకు మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.