AP: కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో కీలక మార్పులు చేసింది. పాత మస్టర్ విధానానికి స్వస్తి పలికి, కొత్తగా ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజీ వల్ల అక్రమాలకు తావుండదు. పనికి రాకుండానే జీతాలు పొందే బోగస్ కూలీల వ్యవహారానికి చెక్ పడనుంది.