ELR: కైకలూరు మండలం తామరకొల్లు గ్రామంలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాడపాటి నాగరాజుకు చెందిన సుమారు మూడు ఎకరాల వరిగడ్డి అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న కైకలూరు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో రూ.40 వేల విలువైన గడ్డివాము నష్టం వాటిల్లినట్లు యజమాని తెలిపారు.