AKP: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 15న నిర్వహించే అక్షరాంధ్ర పరీక్షను విజయవంతం చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ విజ్ఞప్తి చేశారు. అక్షరాంధ్ర పరీక్షపై శనివారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి జిల్లా మండల స్థాయి అధికారులతో వెబెక్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 93,292 అభ్యాసకులు పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు. 2,478 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.