ATP:పామిడి మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు మొక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 30 ఎకరాలలో పంటలు నేలకొరిగినట్లు మండల వ్యవసాయ అధికారి విజయకుమార్ శుక్రవారం మీడియాతో తెలిపారు. పంట నష్టంపై ఉన్నత అధికారులకు నివేదిక పంపినట్లు హార్టికల్ అధికారి మిత్ర పేర్కొన్నారు.