KRNL: కౌతాళంలో డ్రెయినేజీ శుభ్రపరిచే పనులు సోమవారం నుంచి చేపట్టనున్నట్లు మండల MPDO గోపాల్, గ్రామ సర్పంచ్ పాల్ దినకర్, పంచాయతీ కార్యదర్శి యోగేశ్వర్ రెడ్డి తెలిపారు. జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి బాపురం మెయిన్ రోడ్డులోని పెట్రోల్ బంక్ వరకు ఈ పనులు చేపడతామని అధికారులు వెల్లడించారు. రోడ్డు ప్రక్కన ఉన్న షాప్ యజమానులు తమ సామగ్రిని ముందుగా తొలగించాలని హెచ్చరించారు.