అన్నమయ్య: మదనపల్లెలో కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు 20వ నిందితుడు నవీన్ బాబును అరెస్ట్ చేశారు. ఈ కేసు గ్లోబల్ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన అక్రమ కిడ్నీ మార్పిడి ఘటనతో సంబంధం ఉంది. ఇప్పటికే పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో కీలక పాత్రలపై మరింత విచారణ కొనసాగుతోంది. దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.