BPT: కారంచేడు మండల సర్వసభ్య సమావేశం రేపు ఎంపీడీవో కార్యాలయంలో జరగనుంది. ఈ మేరకు ఎంపీడీవో నేతాజీ ఒక ప్రకటన విడుదల చేశారు. మండలంలోని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.