ASF: జైనూర్ మండల కేంద్రంలోని పశువుల సంత, తై బజార్ నిర్వహణకు ఈనెల 24న వేలం పాట నిర్వహించనున్నట్లు సర్పంచ్ కోడప ప్రకాశ్, EO ఆనందరావు సోమవారం తెలిపారు. పాల్గొనే వారు తై బజార్‌కు రూ. 50,000, పశువుల సంతకు రూ. 1,00,000 డిపాజిట్ చెల్లించాలని సూచించారు. వేలంలో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా ఆస్తి పన్ను బకాయిలు చెల్లించి ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.