VKB: తాండూరు పట్టణంలోని పోట్లీ మహారాజ్ ఆలయ కాంప్లెక్స్‌లో ఆస్తి పన్ను చెల్లించని దుకాణాలను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. సోమవారం కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో బృందం తనిఖీలు చేపట్టింది. కొన్నేళ్లుగా మొండి బకాయిలున్న యజమానులకు రెడ్ నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో దుకాణాలకు తాళాలు వేశారు. పన్నులు చెల్లించకుంటే కఠిన చర్యలు తప్పవని చెప్పారు.