NDL: శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు బస్సుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు తక్కువగా నడవడంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఆత్మకూరు, నంద్యాల, మహానంది మార్గాల్లో సమయానికి బస్సులు లేక ప్రయాణం కష్టంగా మారింది. దర్శనం అనంతరం మహానంది వెళ్లాలనుకునే భక్తులు మరింత ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.