KNR: జమ్మికుంట పట్టణంలోని 27వ వార్డులో మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్, కౌన్సిలర్ శీలం శ్రీనివాస్‌తో కలిసి పర్యటించారు. స్థానికులు సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వివరించారు. ఇప్పటికే కొన్ని రోడ్లకు టెండర్లు పిలిచామని, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఛైర్మన్ హామీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్య మిస్తామని ఆయన పేర్కొన్నారు.