NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని 14 వ వార్డుకు చెందిన చింతోజు కృష్ణమూర్తి సోమవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ బావండ్ల మధు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.15 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రమేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.