NTR: విస్సన్నపేట ఎన్టీఆర్ కాలనీ వాసులందరికీ 18వ వార్డు నందు ఒకే బూతుగా ఓటర్ లిస్టు ఏర్పాటు చేయాలని ఎంపీడీవో చిన్నరాట్నాలకు కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు. గతంలో ఆ కాలనీవాసులు వివిధ వార్డులలో ఓట్లు ఉన్నాయని, అందువల్ల కాలనీని అభివృద్ధి చేసుకోలేకపోతున్నామన్నారు. కావున సమస్యను పరిష్కరించాలని ఆయనను కోరారు.